Stock Market: భారీ నష్టాలను చవిచూసిన దేశీయ మార్కెట్లు
Stock Market: 600 పాయింట్లకుపైగా నష్టపోయిన సెన్సెక్స్
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం భారీ నష్టాలను చవిచూశాయి. అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాలకు తోడు, దేశీయంగా కీలక రంగాల షేర్లలో వెల్లువెత్తిన అమ్మకాలు సూచీల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఫలితంగా సూచీలు పతనమయ్యాయి. సెన్సెక్స్ 600 పాయింట్లకు పైగా దిగజారగా.. నిఫ్టీ 22 వేల 350 మార్క్ దిగువకు పడిపోయింది. ఇవాళ ఉదయం 74 వేల 175.93 వద్ద ఫ్లాట్‌గా ప్రారంభమైన సెన్సెక్స్ రోజంతా నష్టాల్లోనే సాగింది. ఒక దశలో 73 వేల 433 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరకు 616.75 పాయింట్లు కోల్పోయి 73 వేల 502.64 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ సైతం 160.90 పాయింట్ల తగ్గి 22 వేల 332.65 వద్ద స్థిరపడింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 8 పైసలు క్షీణించి 82.75 వద్ద ముగిసింది.