Credit Card: క్రెడిట్‌ కార్డ్‌తో డబ్బులు డ్రా చేస్తున్నారా.? జాగ్రత్త..

Credit Card: దేశంలో క్రెడిట్‌ కార్డు వినియోగదారులు భారీగా పెరుగుతున్నారు. ఒకప్పుడు కేవలం కొందరికి మాత్రమే అందుబాటులో ఉన్న క్రెడిట్ కార్డ్స్‌ ప్రస్తుతం దాదాపు ప్రతీ ఒక్కరి దగ్గర ఉంటున్నాయి.

Update: 2024-08-18 06:25 GMT

Credit Card: క్రెడిట్‌ కార్డ్‌తో డబ్బులు డ్రా చేస్తున్నారా.? జాగ్రత్త..

Credit Card: దేశంలో క్రెడిట్‌ కార్డు వినియోగదారులు భారీగా పెరుగుతున్నారు. ఒకప్పుడు కేవలం కొందరికి మాత్రమే అందుబాటులో ఉన్న క్రెడిట్ కార్డ్స్‌ ప్రస్తుతం దాదాపు ప్రతీ ఒక్కరి దగ్గర ఉంటున్నాయి. బ్యాంకుల మధ్య నెలకొన్న పోటీ నేపథ్యంలో క్రెడిట్‌ కార్డులను ఎడాపెడా ఇచ్చేస్తున్నాయి. అలాగే ఈ కామర్స్‌ సంస్థలు క్రెడిట్‌ కార్డులపై ప్రత్యేకంగా డిస్కౌంట్‌ అందిస్తుండడంతో వీటిని ఉపయోగించే వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది.

ఇదిలా ఉంటే క్రెడిట్ కార్డులను కేవలం బిల్లులు చెల్లింపులకే ఉపయోగిస్తామని తెలిసిందే. ఉదాహరణకు ఆన్‌లైన్‌ షాపింగ్ చేసినా, ఆన్‌లైన్‌ పేమెంట్స్‌ చేసే సమయంలో ఈ కార్డులను ఉపయోగిస్తుంటాం. స్వైపింగ్ మిషన్‌లో కార్డును స్వైప్‌ చేయడం ద్వారా మీ క్రెడిట్ లిమిట్‌ నుంచి డబ్బులు విత్‌డ్రా అవుతుంటాయి. అయితే మీకున్న క్రెడిట్ లిమిట్‌లో కొంత నగదును కూడా పొందే అవకాశం ఉంటుంది. ఏటీఎమ్‌ సెంటర్స్‌లో డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు.

అయితే క్రెడిట్ కార్డు ద్వారా ఏటీఎమ్‌లో డబ్బులు విత్‌ డ్రా చేస్తే పలు రకాల ఇబ్బదలులు ఎదుర్కోవాల్సింది. అయితే అత్యవసర పరిస్థితుల్లో నగదు కావాలనుకున్నప్పుడు మాత్రం మీకు క్రెడిట్ కార్డు ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ఏటీఎమ్‌లో విత్‌డ్రా చేసిన నగదుకు మీరు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఈ ట్రాన్సాక్షన్ ద్వారా ఎలాంటి రివార్డ్ పాయింట్స్‌ పొందలేరనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.

ఇక క్రెడిట్‌ కార్డ్‌ నుంచి నగదును విత్‌డ్రా చేసుకునేప్పుడు మీరు ముందుగా 2 శాతం నుంచి 4 శాత వరకు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. మీరు విత్‌డ్రా చేసిన క్యాషపై నెలవారీగా కూడా వడ్డీ వసూలు చేస్తారు. మీరు తీసుకున్న మొత్తం తిరిగి కార్డ్‌లో చెల్లించే వరకు వడ్డీ వేస్తూనే ఉంటారు. అంతేకాదు క్రెడిట్‌ నుంచి విత్‌డ్రా చేసుకున్న మొత్తాన్ని సకాలంలో చెల్లించకపోతే 15 నుంచి 30 శాతం వరకు వడ్డీ పడుతుంది. కాబట్టి వీలైనంత వరకు క్రెడిట్ కార్డు నుంచి నగదు విత్‌డ్రా చేయకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. 

Tags:    

Similar News