Post Office: పోస్టాఫీసు అద్భుత స్కీం.. రూ.10,000 పెట్టుబడితో రూ.16 లక్షల ఆదాయం..!
Post Office: పెట్టుబడిదారులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం రావాలని కోరుకుంటారు.
Post Office: పెట్టుబడిదారులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం రావాలని కోరుకుంటారు. కానీ వారి డబ్బుకి భద్రత ఉంటుందా లేదా అని గమనించరు. దీంతో చాలాసార్లు నష్టపోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. కానీ పోస్టాఫీసు స్కీములలో పెట్టిన పెట్టుబడులు సురక్షితంగా ఉంటాయి. సామాన్య చిన్న తరగతి ప్రజలకి పోస్టాఫీసు పథకాలు అనువుగా ఉంటాయి. అందులో ఒకటి పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ ఖాతా. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఈ పోస్టాఫీసు పథకంలో 10 వేల రూపాయల పెట్టుబడి ద్వారా 16 లక్షల రూపాయల వరకు పొందవచ్చు. ఇది పోస్ట్ ఆఫీస్ ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతా మాదిరే ఉంటుంది. కానీ ఇందులో మీరు ఒకేసారి డబ్బులు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. కానీ రికరింగ్ ఖాతాలో ప్రతి నెలా ఖచ్చితమైన మొత్తాన్ని పెట్టుబడి పెట్టడం ద్వారా వడ్డీని పొందవచ్చు. ప్రస్తుతం ఈ ఖాతాపై ప్రభుత్వం 5.8% వడ్డీ చెల్లిస్తోంది. కాంపౌండింగ్ వడ్డీ ప్రతి మూడో నెలకు కలుపుతారు.
ఈ పోస్ట్ ఆఫీస్ స్కీమ్ మార్కెట్‌కి లింక్ చేయబడదు. దీనివల్ల రిటర్న్‌లకు సంబంధించి ఎలాంటి రిస్క్ ఉండదు. మీ డబ్బు ఇందులో మునిగిపోదు. మీరు నిశ్చింతంగా ఇందులో డబ్బును పెట్టుబడి పెట్టవచ్చు. మీరు ఈ పథకంలో 10 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టాలి. ప్రతి నెలా 10 వేలు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీ మొత్తం పెట్టుబడి 12 లక్షల రూపాయలు అవుతుంది. దీనిపై మీరు 10 సంవత్సరాలలో 5.8% వడ్డీ రేటుతో రూ.16,26,476 పొందుతారు. పోస్టాఫీసు కాంపౌండింగ్ ప్రకారం రికరింగ్ డిపాజిట్ ఖాతాపై వడ్డీని చెల్లిస్తుంది.