BSNL: 160 రోజులు.. 2జీబీ డేటాతో అపరిమిత కాల్స్.. తక్కువ ధరకే బీఎస్‌ఎన్‌ఎల్ నుంచి అదిరిపోయే ఆఫర్
ఈ ప్లాన్ వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా రోజువారీ 2 GB డేటాతోపాటు అపరిమిత కాలింగ్‌తో కూడిన ప్లాన్ రూ. 400 నుంచి రూ. 600 మధ్య ఉంటున్నాయి.
ఓవైపు జియో, ఎయిర్ టెల్ వినియోగదారులకు షాక్‌లు ఇస్తుంటే.. బీఎస్‌ఎన్‌ఎల్ మాత్రం భారీ ఆఫర్లు ప్రకటిస్తోంది. BSNL ఇటీవలే కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా రోజువారీ 2 GB డేటాతోపాటు అపరిమిత కాలింగ్‌తో కూడిన ప్లాన్ రూ. 400 నుంచి రూ. 600 మధ్య ఉంటున్నాయి. ఇటువంటి సమయాల్లో, BSNL అతి తక్కువ ధరకు అపరిమిత కాలింగ్, డేటా ప్లాన్‌ను అందిస్తోంది. దీనిలో అపరిమిత కాలింగ్‌తో పాటు రోజుకు 2 GB డేటా, రోజుకు 100 మెసేజ్‌లు అందిస్తోంది. ఆ ప్లాన్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
BSNL రూ. 997 ప్లాన్..
BSNL రూ. 997 రీఛార్జ్ ప్లాన్‌లో 160 రోజుల చెల్లుబాటు అవుతుంది. ఈ ప్లాన్‌లో మొత్తం 320GB డేటా అందిస్తుంది. ఈ ప్లాన్‌లో, ప్రతిరోజూ 2GB హై స్పీడ్ డేటా ఉంటుంది. ఇది కాకుండా, ప్రతిరోజూ 100 ఉచిత SMS సౌకర్యం అందించనుంది. అలాగే, ఈ నెట్‌వర్క్‌లో ఉచిత అపరిమిత వాయిస్ కాలింగ్, మెసేజింగ్ సౌకర్యం అందుబాటులో ఉంది.
28 రోజుల నెలవారీ వ్యాలిడిటీ గురించి మాట్లాడినతే, ఈ ప్లాన్ చాలా పొదుపుగా ఉంటుంది. BSNL ఈ రూ.997 ప్లాన్ 5 నుంచి 6 నెలల వరకు చెల్లుబాటును అందిస్తుంది. ఇతర టెలికాం కంపెనీల నుంచి 6 నెలల రీఛార్జ్ కోసం, మీరు దాదాపు రూ. 2000 రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ 3జీ సేవలను అందిస్తోంది. అలాగే, కంపెనీ 4G సేవలను వేగంగా ప్రారంభిస్తోంది. వచ్చే ఏడాది నాటికి 5జీ సేవలను ప్రారంభించే యోచనలో ఉంది.
BSNL 15 అక్టోబర్ 2024 నాటికి దేశంలో 4G సేవను ప్రారంభించగలదని చెబుతున్నారు. ఇందుకోసం మొబైల్ టవర్లను వేగంగా అమర్చే పనిని కంపెనీ ప్రారంభించింది. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే ఏడాది మార్చి నాటికి దేశవ్యాప్తంగా 4జీ సేవలు అందుబాటులోకి వస్తాయని అంచనా. BSNL మొబైల్ కాలింగ్, మెసేజింగ్, ఇంటర్నెట్ సేవలను అత్యంత సరసమైన ధరలకు అందించగలదని తెలిసిన విషయమే.