Changes Rules: ఫిబ్రవరి 1 నుంచి ఈ 3 బ్యాంకుల నిబంధనలలో మార్పులు.. అవేంటంటే..?
Changes Rules: ఫిబ్రవరి 1 వచ్చేసింది. ఓ వైపు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెడుతుండగా మరోవైపు మూడు బ్యాంకులు నిబంధనలలో మార్పులు చేర్పులు చేస్తుంది.
Changes Rules: ఫిబ్రవరి 1 వచ్చేసింది. ఓ వైపు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెడుతుండగా మరోవైపు మూడు బ్యాంకులు నిబంధనలలో మార్పులు చేర్పులు చేస్తుంది. కానీ బ్యాంకుల నిబంధనలకు, కొత్త బడ్జెట్‌కు ఎలాంటి సంబంధం లేదు. మార్పులు చేస్తున్న బ్యాంకులు ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్. మీరు ఈ 3 బ్యాంకులలో అకౌంట్ కలిగి ఉంటే మారిన నిబంధనలు కచ్చితంగా తెలుసుకోండి.
ఫిబ్రవరి 1 నుంచి ఎస్బీఐ రూ.2 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు IMPSపై రూ.20, జీఎస్టీని వసూలు చేస్తుంది. ఇంతకు ముందు ఈ నియమం లేదు. ఈ నిబంధన గురించి తెలుసుకున్న తర్వాత మాత్రమే కస్టమర్లు IMPS చేయాల్సి ఉంటుంది. SBI పాత స్లాబ్‌లో రూ.1,000 వరకు నగదు బదిలీకి ఎటువంటి ఛార్జీ లేదు. ఇది ఉచితంగా ఉండేది. IMPS రూ.1,000 నుంచి రూ.10,000 వరకు రూ. 2 ప్లస్ GSTని ఆకర్షిస్తుంది. రూ. 10,000 నుంచి రూ. 1,00,000 వరకు ఉన్న IMPSపై రూ. 4 ప్లస్ GST చెల్లించాలి. IMPS రూ.1,00,000 నుంచి రూ. 2,00,000 వరకు రూ. 12తో పాటు GST చెల్లించాలి. స్టేట్ బ్యాంక్ ఇందులో రూ. 2,00,000 నుంచి రూ. 5,00,000 వరకు IMPSపై 20 రూపాయలు, GST చెల్లించాల్సి ఉంటుంది.
బ్యాంక్ ఆఫ్ బరోడా ఫిబ్రవరి 1 నుంచి చెక్కుల చెల్లింపు విధానంలో మార్పులు చేస్తుంది. కొత్త రూల్ ప్రకారం ఎవరైనా చెక్కు ఇస్తే దానికి సంబంధించిన సమాచారం బ్యాంకుకు తెలపాల్సి ఉంటుంది. దీంతో బ్యాంక్ ఆఫ్ బరోడాకు అధిక ధరల చెక్కులను పాస్ చేయడంలో ఇబ్బంది ఉండదు రీ-కన్ఫర్మేషన్ కోసం బ్యాంక్ కస్టమర్‌ను పిలవాల్సిన అవసరం ఉండదు. రూ. 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ చెక్కులకు నిర్ధారణ తప్పనిసరి లేకుంటే అది చెల్లింపు లేకుండానే తిరిగి వస్తుంది. చెక్ నిర్ధారణ కోసం కస్టమర్ 6 ముఖ్యమైన విషయాల గురించి సమాచారాన్ని అందించాలి. ఇందులో చెల్లింపుదారుని పేరు, చెక్కు మొత్తం, ఖాతా నంబర్, చెక్ నంబర్, లావాదేవీ కోడ్, చెక్కు తేదీని పేర్కొనవలసి ఉంటుంది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఫిబ్రవరి 1 నుంచి షాకింగ్ నిర్ణయం తీసుకుంది. అకౌంట్‌లో మినిమమ్ బ్యాలెన్స్ ఉంటేనే PNB కార్డ్‌పై ఇన్‌స్టాల్‌మెంట్ చేయాలి. లేదంటే బ్యాంకు రూ.250 జరిమానా విధిస్తుంది. ఈ కొత్త నిబంధన ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ విషయాలను గమనించి లావాదేవీలు చేస్తే మంచిది.