PM Kisan: ఆధార్‌ సహాయంతో లబ్ధిదారుల పేరులో మార్పులు.. పూర్తి ప్రక్రియ తెలుసుకోండి..!

PM Kisan: ప్రధాన మంత్రి కిసాన్ యోజన కింద దేశంలోని రైతులకి ప్రతి నాలుగు నెలలకి ఒకసారి రూ.2000 వేల రూపాయలు చెల్లిస్తున్నారు.

Update: 2023-03-05 04:30 GMT

PM Kisan: ఆధార్‌ సహాయంతో లబ్ధిదారుల పేరులో మార్పులు.. పూర్తి ప్రక్రియ తెలుసుకోండి..!

PM Kisan: ప్రధాన మంత్రి కిసాన్ యోజన కింద దేశంలోని రైతులకి ప్రతి నాలుగు నెలలకి ఒకసారి రూ.2000 వేల రూపాయలు చెల్లిస్తున్నారు. వార్షిక ప్రాతిపదికన 6 వేల రూపాయలు అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ పథకం కింద 13వ విడత నడుస్తోంది. పీఎం కిసాన్ యోజన కింద ఏదైనా చిన్న తప్పు జరిగినట్లయితే ఈ పథకం వాయిదాను నిలిపివేస్తారు. ప్రస్తుతం మీ ఆధార్‌కార్డులో పేరు మారినట్లయితే గతంలో ఉన్నపేరుకి ఇప్పుడు ఉన్న పేరుకి తేడా ఉంటుంది. దీంతో అధికారులు ఇన్‌స్టాల్‌మెంట్‌ను నిలిపివేస్తారు.

మళ్లీ పేరు సరిచేయడం ఎలా..?

పథకం నిధులు అందని వారు ఈమెయిల్‌ లేదా ఫోన్‌ నెంబర్‌ ద్వారా ఫిర్యాదు చేసే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించింది. పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి డబ్బు జమ కాని వారు pmkisan-ict@gov.in. and pmkisan-funds@gov.in లేదా హెల్ప్‌లైన్‌ నెంబర్‌ 011-24300606,155261, టోల్‌ ఫ్రీ నెంబర్‌ 1800-115-526కి కాల్‌ చేసి తమ ఫిర్యాదును రిజిస్టర్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే పీఎం కిసాన్ యోజన కింద పేరు మార్చడానికి లేదా సవరించడానికి ఇక్కడ కొన్ని మార్గాలు ఉన్నాయి. వాటి సహాయంతో ఆధార్ ప్రకారం పథకంలో పేరును మార్చవచ్చు. ఆ ప్రాసెస్‌ గురించి వివరంగా తెలుసుకుందాం.

1. ముందుగా పీఎం కిసాన్ యోజన పోర్టల్‌కి వెళ్లాలి. ఇందులో లబ్ధిదారుని పేరు మార్చు ఎంపికకి వెళ్లాలి.

2. తర్వాత ఆధార్ నంబర్, ఇతర సమాచారం అందించాలి. ఆధార్ డేటాబేస్లో సేవ్ చేయబడినప్పుడు పేరును మార్చమని మిమ్మల్ని అడుగుతుంది. ఒకవేళ ఆధార్ డేటాబేస్‌లో సేవ్ కాకపోతే మీరు జిల్లా కార్యాలయాన్ని సంప్రదించాల్సి ఉంటుంది.

3. తదుపరి దశలో మీరు రిజిస్ట్రేషన్ నంబర్, రైతు పేరు, మొబైల్ నంబర్, ఉప-జిల్లా, గ్రామం, ఆధార్ నంబర్ చూస్తారు.

4. తర్వాత KYC అడుగుతుంది. ఇక్కడ మీరు ఆధార్ ప్రకారం మీ పేరు, పుట్టిన తేదీ, ఇతర సమాచారాన్ని అప్‌డేట్‌ చేయవచ్చు.

5. తదుపరి ప్రక్రియలో ఆధార్ సైడింగ్ తనిఖీ అవుతుంది. బ్యాంక్‌తో ఆధార్‌ను లింక్ చేయకపోతే వెంటనే లింక్ చేయాలని సూచిస్తుంది.

Tags:    

Similar News