Onion Price: సామాన్యులకు ఊరట.. పెరుగుతున్న ఉల్లి ధరలకు చెక్‌పెట్టేలా కేంద్రం నిర్ణయం..!

Onion Price: కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు ఊరటనిచ్చే వార్త చెప్పింది. దేశంలో క్రమంగా పెరుగుతోన్న ఉల్లి ధరలకు చెక్‌ పెట్టేలా నిర్ణయం తీసుకుంది.

Update: 2024-09-23 11:22 GMT

Onion Price: సామాన్యులకు ఊరట.. పెరుగుతున్న ఉల్లి ధరలకు చెక్‌పెట్టేలా కేంద్రం నిర్ణయం..!

Onion Price: కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు ఊరటనిచ్చే వార్త చెప్పింది. దేశంలో క్రమంగా పెరుగుతోన్న ఉల్లి ధరలకు చెక్‌ పెట్టేలా నిర్ణయం తీసుకుంది. ఉల్లి ధరలను నియంత్రించడానికి ఇది వరకే సేకరించి ముందస్తుగా నిల్వ చేసిన (బఫర్‌ స్టాక్‌ ) స్టాక్‌ను హోల్‌సేల్‌ మార్కెట్లోకి విడుదల చేయాలని నిర్ణయించింది. కాగా ఇటీవల దేశంలో ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు తొలగించిన విషయం తెలిసిందే. దీంతో దేశంలో ఉల్లి రిటైల్ ధరలు క్రమంగా పెరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే దిల్లీతో పాటు మరికొన్ని ప్రధాన నగరాల్లోని హోల్‌సేల్ మార్కెట్లోకి బఫర్‌ స్టాక్‌ను విడుదల చేయాలని నిర్ణయించినట్లు వినియోగదారు వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి నిధి ఖరే సోమవారం తెలిపారు. రాయితీ ఉల్లిని దేశవ్యాప్తంగా కూడా రిటైల్‌గా విక్రయించే ఆలోచన చేస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా నిధి ఖరే మాట్లాడుతూ.. 'ఇటీవల ఎగుమతుల సుంకం ఎత్తివేసిన నేపథ్యంలో ఉల్లి ధరలు పెరుగుతాయని అంచనా వేస్తున్నాం. దీంతో 4.7 లక్షల టన్నుల బఫర్‌ స్టాక్‌ విడుదలకు నిర్ణయించాం. దీంతో పాటు ఖరీఫ్‌లో పెరిగిన ఉల్లి విస్తీర్ణంతో ఉల్లి ధరలకు కళ్లెం పడుతుందని ఆశిస్తున్నాం' అని చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉంటే దేశీయంగా ఉల్లి రైతులకు మెరుగైన ధర దక్కాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం.. ఉల్లి ఎగుమతులపై ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తూ పది రోజుల క్రితం నిర్ణయం తీసుకుంది.

టన్నుకు 550 డాలర్లుగా ఉన్న కనీస ఎగుమతి ధరను తొలగించింది. అయితే ఈ ఎఫెక్ట్ ఉల్లి ధరలపై పడింది. ఇప్పటికే దేశంలో పలు చోట్ల కిలో ఉల్లి ధర రూ. 60కి చేరింది. మరి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఉల్లి ధరలు ఏమేర తగ్గుతాయో చూడాలి. 

Tags:    

Similar News