Pension Scheme: ప్రతినెలా బంఫర్ రిటర్న్స్.. కొత్త పెన్షన్ స్కీమ్ ప్లాన్ చేసిన ప్రభుత్వం.. అదేంటంటే?
Pension Scheme: పీఎఫ్‌ఆర్‌డీఏ చైర్మన్ దీపక్ మహంతి మాట్లాడుతూ ప్రజల కోసం ఓ అద్భుతమైన పథకాన్ని తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. తద్వారా వారు మరింత మెరుగైన రాబడిని పొందవచ్చని అంటున్నారు.
Pension Scheme: సామాన్యులకు ప్రతినెలా కనీస రాబడి వచ్చేలా ప్రభుత్వం ఎన్నో పెన్షన్ స్కీమ్‌లను సిద్ధం చేస్తోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రభుత్వం 2024 ఎన్నికలలోపు మరో పెన్షన్ పథకాన్ని ప్రకటించే ఛాన్స్ ఉంది. ఇటువంటి ప్రొడక్ట్‌ను పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ప్లాన్ చేస్తుంది. పీఎఫ్‌ఆర్‌డీఏ చైర్మన్ స్వయంగా సమాచారం ఇస్తూ, కనీస హామీ రాబడులు ఇవ్వడానికి పెన్షన్ పథకాన్ని త్వరలో ప్రకటించవచ్చని తెలిపారు.
త్వరలోనే ప్రణాళిక..
పీఎఫ్‌ఆర్‌డీఏ ఛైర్మన్ దీపక్ మొహంతి మాట్లాడుతూ కొత్త పెన్షన్ పథకం పనులు శరవేగంగా జరుగుతున్నాయని, త్వరలో ప్రకటించవచ్చని అన్నారు. అటల్ పెన్షన్ యోజన ఉదాహరణను ఇస్తూ, APYపై ప్రభుత్వం హామీ ఇస్తుందని, దాని ఖర్చు వినియోగదారుడు చెల్లిస్తున్నారని చెప్పుకొచ్చారు.
కొత్త పెన్షన్ ప్లాన్ గురించి పలు వివరాలను తెలియజేస్తూ.. హామీ ఇవ్వబడిన రిటర్న్‌లను అందించడానికి PFRDA మరింత డబ్బు చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. ఇందుకు గల కారణాన్ని తెలియజేస్తూ.. ఇందులో మరింత ప్రమాదం ఉంటుందన్నారు. ప్రజల కోసం ఓ అద్భుతమైన పథకాన్ని తీసుకురావాలనుకుంటున్నామని, తద్వారా వారు మరింత మెరుగైన రాబడిని పొందగలరని ఆయన అన్నారు.
అటల్ పెన్షన్ యోజనలో పెరుగుతున్న వినియోగదారులు..
మరోవైపు, సమాచారం ఇస్తూ, అటల్ పెన్షన్ యోజన కోసం సుమారు 5.3 కోట్ల కస్టమర్ బేస్‌ను సిద్ధం చేసినట్లు మహంతి చెప్పారు. ప్రస్తుత సంవత్సరానికి 1.3 కోట్ల మందిని ఏపీవైకి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2022 సంవత్సరంలో, 1.2 కోట్ల మంది ఈ పథకంలో ప్రవేశించారు. ఏపీవైలో ఖాతాదారులను పెంచడంలో గ్రామీణ బ్యాంకుల పని చాలా బాగా జరుగుతోందని ఏపీవైపై మహంతి అన్నారు. మరోవైపు కొత్త పెన్షన్ విధానంపై కమిటీ నివేదికపై మహంతి అడిగిన ప్రశ్నకు.. ఇప్పుడేం చెప్పలేమని అన్నారు.