Post Office: రోజుకు రూ. 333 పొదుపు చేస్తే చేతికి రూ. 17 లక్షలు.. సూపర్ స్కీమ్..!
Post Office: ప్రస్తుతం సంపాదనకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో పొదుపు చేయడానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తున్నారు.
Post Office: ప్రస్తుతం సంపాదనకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో పొదుపు చేయడానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఉద్యోగంలో చేరిన మొదటి రోజు నుంచే పొదుపుపై దృష్టిసారిస్తున్నారు. భవిష్యత్తులో ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకూడదనే ఉద్దేశంతో పొదుపు చేస్తున్నారు. ఇందుకోసం ఎన్నో రకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి పథకాల్లో కేంద్ర ప్రభుత్వ సంస్థ పోస్టాఫీస్ అందిస్తోన్న రికరింగ్ డిపాజిట్ స్కీమ్ ఒకటి. ఈ రికరింగ్ డిపాజిట్ స్కీమ్‌ను దేశంలోని వివిధ బ్యాంకులతో పాటు ఇండియన్ పోస్ట్ ఆఫీస్ కూడా అందిస్తోంది.
మరి ఈ పథకంలో రోజుకు రూ. 333 పెట్టుబడి పెట్టడం ద్వారా ర. 17 లక్షలు ఎలా పొందచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. రికరింగ్ డిపాజిట్ స్కీమ్ అనేది ఒక ప్రత్యేకమైన టర్మ్ డిపాజిట్ పాలసీ. తక్కువ సమయంలో మంచి లాభాలు చేతికి రావాలనుకునే వారికి ఈ స్కీమ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ పథకం మెచ్యూరిటీ వ్యవధి 5 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. ఇక ఇందులో పెట్టుబడి పెట్టిన మొత్తానికి ప్రస్తుతం 6.7 శాతం వడ్డీ రేటును అందిస్తున్నారు. మరో ఐదేళ్లు పొడగించుకోవచ్చు.
ఇక ఇందులో కనీసం రూ. 100 నుంచి పెట్టుబడి పెట్టొచ్చు, గరిష్టంగా లిమిట్ అంటూ ఏం లేదు. మరి పదేళ్లలో చేతికి రూ. 17 లక్షలు రావాలంటే ఎంత పెట్టుబడి పెట్టాలంటే. ఇందుకోసం మీరు రోజుకు రూ.333 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఈ లెక్కన మీరు నెలకు రూ. 10 వేలు పొదుపు చేస్తారు. ఈ స్కీమ్ మెచ్యూరిటీ వ్యవధి 5 సంవత్సరాలు ఉంటుంది. దీంతో వడ్డీతో కలుపునొకి ఏడాదికి రూ. 7.13 లక్షలు అవుతుంది. మరో ఐదేళ్లు పెట్టుబడి కొనసాగిస్తే.. 10 సంవత్సరాల మెచ్యూరిటీ తర్వాత మీ పెట్టుబడి రూ.12 లక్షలు, దానిపై వడ్డీ రూ. 5,80,546 అవుతుంది. అంటే పదేళ్లలో మీరు పెట్టుబడి పెట్టిన అసలుతో పాటు వడ్డీ కలుపుకొని మొత్తం రూ. 17 లక్షల 8వేల 546 చేతికి వస్తాయి. ఎలాంటి రిస్క్ లేకుండా మంచి రిటర్న్స్ పొందాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు.