Post Office Scheme: పేరుకే జీవిత బీమా.. మెచ్యూరిటీ తర్వాత చేతికి రూ. 50 లక్షలు.. పూర్తి వివరాలు మీకోసం..!
Post Office Scheme Update: పోస్టాఫీసులో ఎన్నో అద్భుతమైన పథకాలు ఉన్నాయి. వాటిలో డబ్బును ఇన్వెస్ట్ చేస్తే.. గడువు తీరిన తర్వాత అధిక మొత్తంలో డబ్బు చేతికి వస్తుంది. మెచ్యూరిటీ పూర్తయిన తర్వాత అధిక వడ్డీని, అలాగే ఎక్కువ రాబడిని పొందే అవకాశం ఉంది.
Post Office Scheme: పోస్టాఫీసులో ఎన్నో అద్భుతమైన పథకాలు ఉన్నాయి. వాటిలో డబ్బును ఇన్వెస్ట్ చేస్తే.. గడువు తీరిన తర్వాత అధిక మొత్తంలో డబ్బు చేతికి వస్తుంది. మెచ్యూరిటీ పూర్తయిన తర్వాత అధిక వడ్డీని, అలాగే ఎక్కువ రాబడిని పొందే అవకాశం ఉంది. పోస్టాఫీసులో జీవిత బీమా సౌకర్యం కూడా పొందే అవకాశం ఉంది. ఈ రోజు మీకోసం అలాంటి ఓ పథకం గురించి చెప్పబోతున్నాం. దీని ద్వారా మీరు మీ డబ్బును రెట్టింపు చేసుకోవచ్చు.
డబ్బు రెట్టింపు అవుతుంది..
ఈ పథకం పేరు పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్. మీరు ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా డబ్బును రెట్టింపు చేసుకోవచ్చు. ఇది పురాతన ప్రభుత్వ బీమా పథకం. మీరు దీనిలో ఎలా దరఖాస్తు చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
రూ. 50 లక్షల వరకు..
ఈ పథకంలో, పాలసీదారుడు రూ. 50 లక్షల వరకు పాలసీ తీసుకోవచ్చు. 19 ఏళ్ల నుంచి 55 ఏళ్ల లోపు వారు ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు. ఇందులో మీకు బోనస్ కూడా లభిస్తుంది. దీనితో పాటు, కనీస హామీ మొత్తం రూ. 20,000, గరిష్టంగా రూ. 50 లక్షలు అందుబాటులో ఉన్నాయి. పాలసీదారుడు ఈ పథకం మధ్యలో మరణిస్తే, మొత్తం డబ్బు నామినీకి అందిస్తారు.
లోన్ సదుపాయం..
పాలసీదారు 4 సంవత్సరాల పాటు నిరంతరంగా పాలసీని ఉంచినట్లయితే, అప్పుడు పాలసీదారునికి కూడా రుణ సౌకర్యం అందిస్తారు. మీరు పాలసీని నిలిపివేయాలనుకుంటే, మీరు దానిని 3 సంవత్సరాల తర్వాత చేసుకోవచ్చు. కానీ, మీరు 5 సంవత్సరాల కంటే ముందు నిలిపివేస్తే, మీరు బోనస్ ప్రయోజనం పొందలేరు.
ప్రయోజనం ఎప్పుడు..
ఈ పాలసీ ప్రయోజనం 80 సంవత్సరాల వయస్సులో అందుబాటులో ఉంటుంది. ఎందుకంటే మీరు 80 సంవత్సరాల వయస్సులో మాత్రమే హామీ మొత్తం బీమా సౌకర్యం పొందుతారు.
ఎలా దరఖాస్తు చేయాలంటే?
మీరు ( https://pli.indiapost.gov.in) లింక్‌ని సందర్శించి జీవిత బీమా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పాలసీదారు మరణించిన తర్వాత, మొత్తం డబ్బు నామినీకి అందిస్తారు.