Business Ideas: సంవత్సరమంతా డిమాండ్ తగ్గని ఈ బిజినెస్ చేస్తే నెలకు రూ. 1 లక్ష సంపాదించడం పక్కా

Update: 2024-10-28 01:36 GMT

Telangana Stree Nidhi Scheme

Business Ideas: వ్యాపారం చేయడం ద్వారా మీరు పెద్ద ఎత్తున డబ్బు సంపాదించాలని అనుకుంటున్నారా. అయితే ఓ చక్కటి బిజినెస్ ఐడియా మీ ముందు పెడుతున్నాం. ఈ బిజినెస్ చేయడం ద్వారా మీరు ప్రతి నెల చక్కటి ఆదాయం పొందవచ్చు. అలాంటి బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సెక్యూరిటీ సర్వీసెస్ బిజినెస్ చేయడం ద్వారా మీరు నగరాల్లో పెద్ద మొత్తంలో ఆదాయం సంపాదించవచ్చు.

ముఖ్యంగా అపార్ట్మెంట్లలోనూ, గేటెడ్ కమ్యూనిటీ లోనూ, ప్రైవేట్ సెక్యూరిటీ కి చాలా డిమాండ్ ఉంది. అలాగే ఇళ్లల్లో పనిచేసే సర్వీసుకు సైతం చాలా పెద్ద మొత్తంలో డిమాండ్ ఉంది. దీని దృష్టిలో ఉంచుకొని మీరు సెక్యూరిటీ సర్వీసెస్ బిజినెస్ చేయడం ద్వారా పెద్ద మొత్తంలో ఆదాయం సంపాదించే అవకాశం ఉంది. ఇందుకోసం ముందుగా మీరు ఒక కంపెనీని రిజిస్టర్ చేయించుకోవాలి. అనంతరం మీరు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. సెక్యూరిటీ ఏజెన్సీని ప్రారంభించడానికి రూ. 2,00,000 నుండి రూ, 5,00,000 పెట్టుబడి అవసరం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం.

సెక్యూరిటీ సర్వీస్ బిజినెస్ కోసం కావాల్సిన సర్టిఫికెట్లు ఇవే:

- GST సర్టిఫికేట్

- షాప్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం లైసెన్స్

- PSARA లైసెన్స్ (చెల్లుబాటు: 5 సంవత్సరాలు 1 సంవత్సరం వరకు పొడిగించవచ్చు)

- ISO లైసెన్స్ 18788:2015

- ESI నమోదు (10 మంది కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉంటే)

- PF నమోదు (20 మంది కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉంటే)

PSARA లైసెన్స్ :

ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీల నియంత్రణ చట్టం కింద ఈ సర్వీసులను అందించాలి. భారతదేశంలో ప్రైవేట్ భద్రతా సేవలను అందించే కంపెనీల కోసం. సెక్యూరిటీ ఏజెన్సీని ప్రారంభించడానికి ఈ లైసెన్స్ తప్పనిసరి.

PSARA లైసెన్స్ కోసం ఫీజు ఎంతంటే..?

-ఒక జిల్లాలో సేవ చేయడానికి రూ. 5000.

- ఒక రాష్ట్రంలో ఒకటి కంటే ఎక్కువ కానీ 5 జిల్లాల వరకు పని చేయడానికి. రూ. 10000

- మొత్తం రాష్ట్రంలో పనిచేయడానికి రూ. 25000 చెల్లించాలి.

సెక్యూరిటీ సర్వీసుల్లో ముఖ్యంగా కింద సర్వీసులు అందించాలి..

- సీసీటీవీ మానిటరింగ్ సైబర్ సెక్యూరిటీ సేవలు

- పాఠశాలలు, ఆఫీసులు, బ్యాంకులు, కళాశాలలు, ఆసుపత్రులకు సెక్యూరిటీ గార్డ్ సేవలు.

- ఫ్యాక్టరీల్లో పెట్రోలింగ్ సేవలు

- అత్యవసర పరిస్థితులకు ప్రతిస్పందించడం

- భద్రతా తనిఖీలు నిర్వహించడం

- ఈవెంట్లకు సెక్యూరిటీ అందించడం

సెక్యూరిటీ ఏజెన్సీని ప్రారంభించడానికి ఇది అత్యంత కీలకమైనది. మీరు సెక్యూరిటీ గార్డులుగా నియమించుకునే వ్యక్తులు ఫిట్‌గా ఉండేలా చూసుకోండి. అలాగే వారికి ఎలాంటి క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ఉండకూడదు. మీరు వారికి అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలో శిక్షణ ఇవ్వవలసి ఉంటుంది. ఉద్యోగులను నియమించేటప్పుడు, వారు టర్మ్ కాంట్రాక్ట్‌లపై సంతకం చేశారని నిర్ధారించుకోండి.

Tags:    

Similar News