QR కోడ్‌ స్కాన్ చేసి పేమెంట్‌ చేస్తున్నారా.. ఈ తప్పులు చేయకండి..?

QR Code: కరోనా వల్ల డిజిటల్ పేమెంట్స్‌ పెరిగిపోయాయి.

Update: 2022-02-07 15:30 GMT

QR కోడ్‌ స్కాన్ చేసి పేమెంట్‌ చేస్తున్నారా.. ఈ తప్పులు చేయకండి..?

QR Code: కరోనా వల్ల డిజిటల్ పేమెంట్స్‌ పెరిగిపోయాయి. ఆన్‌లైన్‌ పేమెంట్స్‌తో పాటు ఇప్పుడు చాలామంది QR code స్కాన్ చేసి బిల్లులు చెల్లిస్తున్నారు. ఇది చాలా సులువైన ప్రక్రియ. మార్కెట్‌లో, కిరణాషాపులలో, సూపర్ బజర్‌లలో చాలా చోట్ల ఇప్పుడు క్యూ ఆర్‌ కోడ్లు దర్శనమిస్తున్నాయి. ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్‌ఫోన్‌ ఉండటంతో చెల్లింపులు సులువుగా మారిపోయాయి. కానీ క్యూ ఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒక్కోసారి మోసాలు కూడా జరిగే అవకాశాలున్నాయి. అవేంటో చూద్దాం.

క్యూ ఆర్‌ కోడ్‌ అనేది కేవలం చెల్లింపుల కోసం మాత్రమే. వీటి ద్వారా డబ్బులు విత్‌ డ్రా చేయడం కుదరదు. QR కోడ్‌ని స్కాన్ చేసిన తర్వాత మీరు ఏదైనా యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి లింక్‌ని పొందుతున్నట్లయితే వెంటనే అవైడ్‌ చేయండి. ఏ యాప్‌ను డౌన్‌లోడ్ చేయవద్దు. నిజానికి QR కోడ్ ఒక రకమైన స్టాటిక్ ఇమేజ్. ఇది హ్యాక్ చేయబడదు. చాలా సార్లు కొన్ని చెల్లింపులు విఫలమవుతాయి. ఈ పరిస్థితిలో హ్యాకర్లు దీనిని సద్వినియోగం చేసుకుంటారు. మీకు QR కోడ్‌ను మెస్సేజ్‌ ద్వారా పంపి దానికి చెల్లింపులు చేయాలని చెబితే అస్సలు చేయకండి. ఒకవేళ అలా చేస్తే అకౌంట్‌లోని డబ్బులు మొత్తం మాయమవుతాయి.

QR కోడ్ అనేది ఉత్పత్తి సమాచారం దాగిన ఒక నమూనా. స్కానింగ్ ద్వారా అందులో దాగి ఉన్న సమాచారం గుర్తిస్తారు. అంటే QR కోడ్‌లో ఏదైనా ప్రత్యేక టెక్స్ట్,URL, ఏదైనా మొబైల్ నంబర్‌ కూడా దాచవచ్చు. అయితే QR కోడ్ పూర్తి రూపం క్విక్ రెస్పాన్స్ కోడ్. దీన్ని చేయడం ముఖ్య ఉద్దేశ్యం చెల్లింపును సులభతరం చేయడం మాత్రమే. ఇది చెల్లింపు చేయడానికి వాడాలి కానీ డబ్బు తీసుకోవడానికి కాదు.

Tags:    

Similar News