Multibagger Stock: స్టాక్ మార్కెట్‌లో సునామీ తెచ్చిన మల్టీబ్యాగర్.. రూ. 10వేల పెట్టుబడితో రూ.10 లక్షలు.. 2.5 ఏళ్లలో 10 రెట్ల బంఫర్ లాభాలు..!

Best Multibagger Penny Stocks: మల్టీబ్యాగర్ స్టాక్స్ మాత్రం పెట్టుబడిదారులకు అధిక లాభాలను ఇస్తూ పెట్టబడిదారులను కోటీశ్వరులుగా మార్చాయి. ఇవి ఒకటి లేదా రెండు సంవత్సరాలలో 100 నుంచి 200 శాతం రాబడిని ఇచ్చాయి. అయితే, బ్యాంక్ FDలు కేవలం 7-8% రాబడిని మాత్రమే ఇచ్చాయి.

Update: 2023-07-24 09:38 GMT

Multibagger Stock: స్టాక్ మార్కెట్‌లో సునామీ తెచ్చిన మల్టీబ్యాగర్.. రూ. 10వేల పెట్టుబడితో రూ.10 లక్షలు.. 2.5 ఏళ్లలో 10 రెట్ల బంఫర్ లాభాలు..!

Best Multibagger Stock 2023: స్టాక్ మార్కెట్ ప్రస్తుతం మాంచి లాభాల్లో కొనసాగుతోంది. ఇలాంటి సమయాల్లో చాలామంది ఇందులో పెట్టుబడి పెట్టాలని కోరుకుంటుంటారు. అయితే, కొన్ని స్టాక్‌లు పెట్టుబడిదారులకు అధిక లాభాలు ఇస్తే.. మరికొన్ని మాత్రం భారీగా నష్టాలనే ఇస్తుంటాయి. అయితే, మల్టీబ్యాగర్ స్టాక్స్ మాత్రం పెట్టుబడిదారులకు అధిక లాభాలను ఇస్తూ పెట్టబడిదారులను కోటీశ్వరులుగా మార్చాయి. ఇవి ఒకటి లేదా రెండు సంవత్సరాలలో 100 నుంచి 200 శాతం రాబడిని ఇచ్చాయి. అయితే, బ్యాంక్ FDలు కేవలం 7-8% రాబడిని మాత్రమే ఇచ్చాయి.

ఇటువంటి పరిస్థితిలో 100 నుంచి 200 శాతం మాత్రమే కాదు.. అంతకుమించి అంటే 1000 శాతానికి పైగా రాబడి ఇచ్చిన స్టాక్ ఒకటి ఉంది. అది కూడా కేవలం రెండున్నరేళ్లలో ఉందని ఎవరైనా చెబితే మీరు నమ్ముతారా? కానీ, ఇది కల్పిత కథ కాదండోయ్.. నిజమైన కథ. సముద్ర నౌకలపై పనిచేస్తూ స్టాక్ మార్కెట్‌లో సునామీని తెచ్చిన మజాగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ మల్టీబ్యాగర్ స్టాక్ గురించే ఇప్పుడు తెలుసుకోబోతున్నాం.

శుక్రవారం, మజాగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ షేర్లు ఎన్‌ఎస్‌ఈలో 2.21 శాతం పెరిగి రూ.1,859.90 వద్ద ముగిసింది. ఈ స్టాక్‌లో ఇది ఆల్ టైమ్ హై క్లోజింగ్ లెవెల్. ఇది ట్రేడింగ్ సమయంలో రూ. 1,909.70 స్థాయిని కూడా తాకింది. ఇది దాని కొత్త 52 వారాల గరిష్ట స్థాయిని చేరుకుంది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.37,590 కోట్లుగా మారింది.

6 నెలల్లో మల్టీబ్యాగర్ బంఫర్ రిటర్న్స్..

గత వారంలో Mazagon Dock Shipbuilders Ltd యొక్క స్టాక్ 9 శాతం కంటే ఎక్కువ పెరిగింది. అయితే, గత ఒక నెలలో దాని ధర 58 శాతానికి పైగా పెరిగింది. ఇది గత ఆరు నెలల్లో 140 శాతానికి పైగా జంప్ చేయగా, ఈ ఏడాది ఇప్పటివరకు 135 శాతానికి పైగా పెరిగింది. గత ఏడాది కాలంలో ఈ షేరు ధర 586 శాతానికి పైగా బలపడింది.

ఆకాశాన్ని తాకిన ధర..

నేటి నుంచి 2 సంవత్సరాల క్రితం అంటే 23 జులై 2021న, ఈ షేర్ విలువ రూ.263లు మాత్రమే. అంటే, గత 2 సంవత్సరాలలో, ఈ షేరు ధర 7 రెట్లు ఎక్కువ బలపడింది. మరోవైపు, గత రెండున్నరేళ్లలో, Mazagon Dock Shipbuilders Ltd షేర్ కేవలం రూ. 185 నుంచి రూ. 1,860కి దూసుకెళ్లింది. అంటే ఈ షేర్లు పెట్టుబడిదారులకు 10 రెట్లు విపరీతమైన రాబడిని ఇచ్చాయి.

బ్యాంక్ FD కంటే మిలియన్ రెట్లు లాభాలు..

మజాగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ షేర్లలో ఒక ఇన్వెస్టర్ సుమారు రెండున్నరేళ్ల క్రితం అంటే డిసెంబర్ 2020లో రూ.10,000 ఇన్వెస్ట్ చేసి ఉంటే, ఈరోజు అతని పెట్టుబడి విలువ రూ.10 లక్షలుగా ఉండేది. మరోవైపు రెండున్నరేళ్ల క్రితం ఎవరైనా బ్యాంకు ఎఫ్‌డీలో రూ.10,000 ఇన్వెస్ట్‌ చేస్తే 8 శాతం వడ్డీకి కూడా రూ.2,190 మాత్రమే రాబడి వచ్చేది.

గమనిక: ఇక్కడ అందించిన వివరాలు కేవలం సమాచారం కోసం మాత్రమే. మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడం మార్కెట్ నష్టాలకు లోబడి ఉంటుంది. పెట్టుబడిదారుగా డబ్బును పెట్టుబడి పెట్టే ముందు ఎల్లప్పుడూ నిపుణుల సలహా తీసుకోండి.

Tags:    

Similar News