Business Idea: స్వచ్ఛమైన నెయ్యితో రూ. లక్షల్లో ఆదాయం.. బెస్ట్‌ బిజినెస్‌ ఐడియా

ఇల్లు కదలకుండానే స్వయంగా మీరే నెయ్యిని తయారు చేసి విక్రయించి లాభాలు పొందొచ్చు.

Update: 2024-09-23 15:29 GMT

 Business Idea: స్వచ్ఛమైన నెయ్యితో రూ. లక్షల్లో ఆదాయం.. బెస్ట్‌ బిజినెస్‌ ఐడియా

తాజాగా తిరుమల లడ్డు వ్యవహారం ఎంత చర్చకు దారి తీస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతో మంది పవిత్రంగా భావించే తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి ఉపయోగించారన్న వార్త ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఇలాంటి తరుణంలోనే ప్రజలు నేచురల్ ప్రొడక్ట్స్‌ వైపు మొగ్గు చూపుతున్నారు. కల్తీ లేని వస్తువులకు ధర కాస్త ఎక్కువైనా పర్లేదు ఖర్చు చేస్తామంటున్నారు. ఇదిగో దీనిని మీ వ్యాపార అస్త్రంగా మార్చుకుంటే.. సమాజంలో కల్తీ లేని వస్తువులను తయారు చేయడంతో పాటు మంచి లాభాలను సైతం ఆర్జించవచ్చు. ఇలా స్వచ్ఛమైన నెయ్యిని తయారు చేస్తూ ఇంట్లోనే భారీగా లాభాలు ఆర్జించవచ్చు.

ఇల్లు కదలకుండానే స్వయంగా మీరే నెయ్యిని తయారు చేసి విక్రయించి లాభాలు పొందొచ్చు. ఇంతకీ నెయ్యి తయారీకి కావాల్సిన వస్తువులు ఏంటి.? లాభాలు ఎలా ఉంటాయి.? ఎంత పెట్టుబడి కావాలి లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. నెయ్యి తయారీకి క్రీమ్‌ను సెపరేట్ చేసే మిషిన్‌ను కొనుగోలు చేయాలి. వీటిలో హ్యాండ్ ఆపరేటింగ్‌, మోటర్‌ ఆపరేటింగ్ అనే రెండు రకాల మిషిన్స్‌ ఉన్నాయి.

ఇక మిషిన్‌ కొనుగోలు చేసిన తర్వాత నెయ్యి తయారీకి ఫ్యాట్ ఎక్కువగా ఉండే పాలను పాల కేంద్రం నుంచి లేదా నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేయాలి. అనంతరం పాలను క్రీమ్‌ సెపరేట్ మిషన్‌లో పోయాలి. మిసిన్‌ ఆన్‌ చేయగానే.. ఒకవైపు నుంచి పాలు మరో వైపు నుంచి క్రీమ్‌ వస్తుంది. ఈ క్రీమును తీసుకొని వేడి చేస్తే నెయ్యి రడీ అయినట్లే. దీనిని చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో రడీ చేసుకొని మీరే స్థానికంగా విక్రయించుకోవచ్చు. ఇక క్రీమ్‌ తీసిన తర్వాత వచ్చే పాలను కూడా టీ దుకాణాలకు, హోటల్స్‌కు విక్రయించుకోవచ్చు. లేదంటే పాలను పెరుగుగా మార్చే మీరు విక్రయించవచ్చు.

లాభాల విషయానికొస్తే.. సాధారణంగా ఒక కేజీ నెయ్యి తయారు చేయాలంటే సుమారు 20 లీటర్ల పాలు అవసరమవుతాయి. ఉదాహరణకు మీరు 100 లీటర్ల పాలు తీసుకుంటే.. 5 కిలోల నెయ్యితో పాటు 80 లీటర్ల పాలు వస్తాయి. ప్రస్తుతం మార్కెట్లో కిలో నెయ్యి ధర రూ. 700 వరకు ఉంది. ఈ లెక్కన 100 లీటర్ల పాలతో సుమారు రూ. 3500 లాభం వస్తుంది. అలాగే మిగిలిన పాలను కనీసం లీటర్‌కు రూ. 40 చొప్పున అమ్ముకున్నా రూ. 3200 లాభం వస్తుంది. ఈ లెక్కన 100 లీటర్ల పాలతో రూ. 6700 సంపాదించొచ్చు.

Tags:    

Similar News