మహిళలకి గుడ్‌న్యూస్.. పోస్టాఫీసు తర్వాత మొదటిసారి ఈ బ్యాంకులో..!
Mahila Samman Saving Certificate: కేంద్ర ప్రభుత్వం మహిళల అభివృద్ధికి వివిధ రకాల స్కీంలని ప్రవేశపెడుతుంది.
Mahila Samman Saving Certificate: కేంద్ర ప్రభుత్వం మహిళల అభివృద్ధికి వివిధ రకాల స్కీంలని ప్రవేశపెడుతుంది. అందులో భాగంగా ఫిబ్రవరి 1, 2023న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీంని ప్రారంభించింది. అయితే ఇది కొన్ని రోజులుగా పోస్టాఫీసులో మాత్రమే అందుబాటులో ఉండేది. ఈ స్కీంని అన్ని ప్రభుత్వరంగ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు అందించవచ్చని తెలిపింది. కానీ ఇప్పటి వరకు ఏ బ్యాంకు ప్రారంభించలేదు. అయితే తాజాగా బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ సేవలని ప్రారంభించిన మొదటి బ్యాంకుగా నిలిచింది. అయితే మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ ఏ విధంగా ఉపయోగపడుతుందో ఈరోజు తెలుసుకుందాం.
మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ పథకంలో ఏ మహిళ అయినా పెట్టుబడి పెట్టవచ్చు. తల్లిదండ్రులు తమ కుమార్తెల తరపున పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడానికి కనీస మొత్తం రూ.1000. తర్వాత రూ.100 గుణిజాల్లో రూ.2 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. అంతేకాదు ఒక వ్యక్తి ప్రతి ఖాతాకు మధ్య మూడు నెలల గ్యాప్‌తో రెండు, మూడు ఖాతాలను తెరవవచ్చు.
ఎంత రాబడి..?
ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన మహిళలు మంచి రాబడిని పొందుతారు. దాదాపు 7.5 శాతం వార్షిక వడ్డీని పొందుతారు. ఇది ప్రతి త్రైమాసికంలో ఖాతాలో జమ అవుతుంది. ప్రస్తుత ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ కింద వచ్చే ఆదాయాలన్నీ పన్ను పరిధిలోకి వస్తాయి. ప్లాన్‌పై TDS తీసివేయబడదు. అయితే ఖాతా తెరిచిన రెండేళ్ల తర్వాత మెచ్యూర్ అవుతుంది. ఈ ఖాతాలను మార్చి 31, 2025 వరకు ఓపెన్ చేయవచ్చు.
అకౌంట్ క్లోజ్
ఖాతాదారుడు మరణిస్తే అకౌంట్‌ను ముందుగానే క్లోజ్ చేయవచ్చు. ఒకవేళ ఖాతాదారుడు మరణించే అవకాశం ఉన్నట్లయితే అకౌంట్ మెయింటెన్ చేయడంలో ఇబ్బందిని ఎదుర్కొంటున్నట్లయితే ముందస్తుగా క్లోజ్ చేసే అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భంలో 7.5% ప్రామాణిక రేటుతో అసలు మొత్తంపై వడ్డీ చెల్లిస్తారు. ఖాతా తెరిచిన రోజు నుంచి ఆరు నెలల తర్వాత 2 శాతం జరిమానాతో అకౌంట్ క్లోజ్ చేయవచ్చు. అప్పుడు వడ్డీ రేటు 5.5 శాతం ఉంటుంది. ఖాతా తెరిచిన తేదీ నుంచి ఒక సంవత్సరం తర్వాత ఖాతాదారుడు అర్హత ఉన్న బ్యాలెన్స్‌లో 40% వరకు విత్ డ్రా చేసుకునే సదుపాయం ఉంటుంది.