Bank Holidays In October 2024: అక్టోబర్ నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు..పూర్తి జాబితా ఇదే
Bank Holidays In October 2024: బ్యాంకు కస్టమర్లకు బిగ్ అలర్ట్. 2024 అక్టోబర్ నెలలో ఏకంగా 15రోజులు బ్యాంకులు బంద్ కానున్నాయి. మీకు ఏవైనా ముఖ్యమైన పనులు ఉంటే ముందుగానే ఆ పనులు చేసుకోండి. లేదంటే బ్యాంకులు ఏయే తేదీల్లో బంద్ ఉంటాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం. లేదంటే తర్వాత ఇబ్బందులు ఎదుర్కొవల్సి వస్తుంది.బ్యాంకులు ఎప్పుడెప్పుడు బంద్ ఉండనున్నాయో చూద్దాం.
Bank Holidays In October 2024: ఆర్బిఐ 2024 అక్టోబర్ నెలకు సంబంధించిన బ్యాంక్ సెలవుల జాబితా విడుదల చేసింది. దీని ప్రకారం దేశంలోని పలు బ్యాంకులకు ఏకంగా 15రోజులపాటు సెలవులు వస్తున్నాయి. వీటిలో కొన్ని జాతీయ సెలువులు ఉండగా కొన్ని ప్రాంతీ సెలవులు ఉన్నాయి. అందువల్ల కస్టమర్లు ముందుగా ఈ సెలవులను ద్రుష్టిలో ఉంచుకుని తమ అవసరాలకు అనుగుణంగా బ్యాంకింగ్ కార్యకలాపాలను ప్లాన్ చేసుకోవాలి.
అక్టోబర్ 1 - అసెంబ్లీ ఎన్నికల కారణంగా జమ్మూలో బ్యాంకులు మూతబడి ఉంటాయి.
అక్టోబర్ 2 - గాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది.
3 అక్టోబర్ - నవరాత్రి స్థాపన కారణంగా జైపూర్‌లోని బ్యాంకులకు సెలవు ఉంటుంది.
6 అక్టోబర్ - ఆదివారం కారణంగా దేశం మొత్తం సెలవు ఉంటుంది.
అక్టోబర్ 10 - దుర్గాపూజ, దసరా, మహా సప్తమి కారణంగా అగర్తల, గౌహతి, కోహిమా, కోల్‌కతాలో బ్యాంకులకు సెలవు.
అక్టోబర్ 11 - దసరా, మహా అష్టమి, మహానవమి, ఆయుధ పూజ, దుర్గాపూజ, దుర్గా అష్టమి కారణంగా అగర్తల, బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, గాంగ్‌టక్, గౌహతి, ఇంఫాల్, ఇటానగర్, కొహిమా, ఇంఫాల్, కోల్‌కతా, పాట్నా, రాంచీ, షిల్లాంగ్‌లలో బ్యాంకులకు సెలవు ఉంటుంది.
12 అక్టోబర్ - దసరా, విజయదశమి, దుర్గాపూజ కారణంగా దేశవ్యాప్తంగా దాదాపు బ్యాంకులు మూతపడనున్నాయి.
13 అక్టోబర్ - ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివేయబడతాయి.
14 అక్టోబర్ - దుర్గాపూజ లేదా దాసేన్ కారణంగా గాంగ్‌టక్‌లోని బ్యాంకులకు సెలవు ఉంటుంది.
అక్టోబర్ 16 - లక్ష్మీ పూజ కారణంగా అగర్తల మరియు కోల్‌కతాలో బ్యాంకులు మూసివేయబడతాయి.
17 అక్టోబర్ - మహర్షి వాల్మీకి జయంతి, కాంతి బిహు నాడు బెంగళూరు మరియు గౌహతిలోని బ్యాంకులకు సెలవు ఉంటుంది.
అక్టోబర్ 20 - ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివేయబడతాయి.
26 అక్టోబర్ - నాల్గవ శనివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివేయబడతాయి.
అక్టోబర్ 27 - ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది.
అక్టోబర్ 31 - దీపావళి కారణంగా దాదాపు దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది.