Business Idea: పెన్నులు తయారు చేస్తూ నెలకు రూ. 20 వేలు సంపాదించొచ్చు..

Business Idea: బిజినెస్‌ అనగానే లక్షల్లో పెట్టుబడి అవసరం ఉంటుందని భావిస్తుంటారు. కానీ ఈ వ్యాపారాన్ని తక్కువ పెట్టుబడిలో పెట్టొచ్చు.

Update: 2024-06-25 14:30 GMT

Business Idea: పెన్నులు తయారు చేస్తూ నెలకు రూ. 20 వేలు సంపాదించొచ్చు..

Business Idea: మారుతోన్న ఆర్థిక అవసరాలు, పెరుగుతోన్న ఖర్చుల నేపథ్యంలో ప్రస్తుతం ఆదాయం పెరిగే మార్గాలపై ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇందుకోసం వ్యాపారమే బెస్ట్ ఆప్షన్‌గా భావిస్తున్నారు. ఓవైపు ఉద్యోగం చేస్తూనే మరో వైపు వ్యాపారం కూడా చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఇంట్లోనే ఉంటూ చేసుకునే వ్యాపారాలు ఎన్నో అందుబాటులో ఉన్నాయి. అలాంటి ఓ బిజినెస్‌ ఐడియా గురించి ఈరోజు తెలుసుకుందాం.

బిజినెస్‌ అనగానే లక్షల్లో పెట్టుబడి అవసరం ఉంటుందని భావిస్తుంటారు. కానీ ఈ వ్యాపారాన్ని తక్కువ పెట్టుబడిలో పెట్టొచ్చు. అదే బాల్‌ పెన్‌ తయారీ. ప్రస్తుతం యూజ్‌ అండ్‌ త్రో పెన్నులకు మార్కెట్లో భలే డిమాండ్‌ ఉంటోంది. బాల్ పెన్స్‌ తయారీని ఇంట్లోనే ఉంటూ చేసుకోవచ్చు. వీటి తయారీకి అవసరయ్యే మిషన్స్‌ ధర కూడా కేవలం రూ. 20 వేలలోపు మాత్రే ఉంటుంది. బాల్‌ పెన్‌ తయారీకి ఇంక్‌ ఫిల్లర్‌, ఆడప్టర్‌ ఫిట్టింగ్ మిషిన్‌, టిఫ్‌ ఫిట్టింగ్‌, నేమ్‌ ప్రింటింగ్‌ మిషన్, సెంట్రి ఫ్యూజ్‌ మిషన్ కావాల్సి ఉంటుంది.

వీటితో పాటు పెన్స్‌ (బ్యారెల్‌), క్యాప్స్‌, నిబ్స్‌, ఆడపర్లు కావాలి. ఇవన్నీ ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్నాయి. మిషన్స్ అమ్మేవారే ముడి సరుకు కూడా అందిస్తున్నారు. ఇక బాల్ పెన్‌ తయారీకి సంబంధించిన వీడియోలు సైతం యూట్యూబ్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇక ఒక పెన్ను తయారీకి సుమారు రూపాయిన్నర ఖర్చు అవుతుంది. మార్కెట్లో ప్రస్తుతం ఈ పెన్నుల ధర రూ. 3 నుంచి రూ. 4 వరకు అందుబాటులో ఉంది. మీరు హోల్‌సేల్‌లో విక్రయించినా తక్కువలో తక్కువ ఒక్క పెన్నుపై 75 పైసలు మిగులుతాయి.

రోజులో కనీసం వెయ్యి పెన్నులను సులభంగా చేయొచ్చు. మీరు ఒకవేళ రోజుకు వెయ్యి పెన్నులను సేల్‌ చేయగలిగితే రూ. 750 లాభం పొందొచ్చు. ఈ లెక్కన మీ నెల ఆదాయం రూ. 20 వేల పైమాటే. లేదు మొదట్లో తక్కువ విక్రయించిన రూ. 10 వేలకు ఆదాయం తగ్గదు. అనంతరం మార్కెటింగ్ పెంచుకుంటూ సేల్స్‌ పెంచుకుంటే లాభాలు పెరుగుతాయి. 

Tags:    

Similar News