Toyota: టయోటా కస్టమర్లకు బ్యాడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి ధరల పెరుగుదల
Toyota: టయోటా కస్టమర్లకు బ్యాడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి ధరల పెరుగుదల
Toyota: కొత్త ఆర్థిక సంవత్సరంలో వాహనాల ధరలను పెంచడం ఒక ట్రెండ్‌గా మారింది. తాజాగా ఈ జాబితాలో టయోటా కిర్లోస్కర్ మోటార్ నిలిచింది. టయోటా తన అన్ని కార్ల ధరలను ఏప్రిల్ 1, 2022 నుంచి 4 శాతం వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ధరల పెరుగుదల, ముడిసరుకు ధరలు ఇటీవల పెరిగిన కారణంగా ధరలను పెంచాల్సిన అవసరం ఏర్పడిందని టయోటా ఒక ప్రకటనలో తెలిపింది.
టయోటా ఇండియాలో 6 మోడళ్లను విక్రయిస్తోంది
ఈ జపనీస్ ఆటోమేకర్ భారతదేశంలో టయోటా గ్లాంజాతో పాటు ఫార్చ్యూనర్, ఇన్నోవా క్రిస్టా, క్యామ్రీ, వెల్‌ఫైర్, అర్బన్ క్రూయిజర్‌లతో సహా 6 మోడళ్లను విక్రయిస్తోంది. వీటిలో గ్లాంజా 2022 మోడల్‌ను కంపెనీ ఇటీవల విడుదల చేసింది. టయోటా మోటార్ త్వరలో మార్కెట్లోకి కొత్త వాహనాన్ని తీసుకురాబోతోంది. అది Hilux పికప్ ట్రక్.
కంపెనీ దీనిని జనవరిలో ప్రారంభించాలనుకుంది. కుదరలేదు తర్వాత మార్చిలో ప్రారంభించాలని భావించారు. కానీ వీలుపడలేదు. ఇప్పుడు బుకింగ్‌లు తీసుకోవడం కూడా ఆపివేసింది. కానీ ఎందుకు వాయిదా వేస్తున్నారో కారణం మాత్రం వెల్లడించలేదు. టయోటా మాత్రమే కాదు, బిఎమ్‌డబ్ల్యూ, ఆడి, మెర్సిడెస్-బెంజ్ సహా అనేక ఇతర కంపెనీలు భారతదేశంలో ధరలను పెంచుతున్నట్లు ఇప్పటకే ప్రకటించాయి.