Ayushman Bharat PMJAY: ఆయుష్మాన్ భారత్ బీమాకు ఇప్పటికే 35 కోట్ల మంది దరఖాస్తు చేసుకున్నారు... మీరు చేశారా?
Ayushman Bharat: దేశ ప్రజల ఆరోగ్య అవసరాలను తీరుస్తూ కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్‌ఆరోగ్య యోజన (AB PM-JAY) పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
Ayushman Bharat: దేశ ప్రజల ఆరోగ్య అవసరాలను తీరుస్తూ కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్‌ఆరోగ్య యోజన (AB PM-JAY) పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పథకంలో భాగంగా ఆదాయంతో సంబంధం లేకుండా దేశంలో 70 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరినీ ఈ పథకంలో ప్రభుత్వం భాగం చేసింది. ధన్వంతరి జయంతి, 9వ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ఈ పథకానికి ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు. ఇంతకీ ఈ పథకం ద్వారా ఎలాంటి బెనిఫిట్స్ పొందొచ్చు.? ఈ పథకానికి ఎలా దరఖాస్తు చసుకోవాలి.? లాంటి పూర్తి వివరాల ఇప్పుడు తెలుసుకుందాం.
అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఈ పథకం కింద ప్రత్యేక కార్డులను అందిస్తారు. 70 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ఇతర సీనియర్ సిటిజన్లందరూ కుటుంబ ప్రాతిపదికన సంవత్సరానికి రూ. 5 లక్షల వరకు బీమాను పొందుతారు. ఈ పథకం ద్వారా దేశంలో సుమారు 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు ప్రయోజనం జరగనుంది. ఈ పథకంలో భాగంగా వైద్య పరీక్షలు, చికిత్స, ప్రీ-హాస్పిటలైజేషన్ కేర్, అడ్మిట్ అయ్యే 3 రోజుల ముందు వరకు అయ్యే ఖర్చులు అన్నీ కవర్ అవుతాయి. అంతేకాకుండా నాన్-ఇంటెన్సివ్, ఇంటెన్సివ్ కేర్ సర్వీసెస్ (ఐసీయూ కేర్)లతో పాటు.. రోగనిర్ధారణ, ల్యాబ్ రిపోర్టులు.. ఆసుపత్రిలో ఉన్న సమయంలో వసతి, ఆహార సేవలు,
డిశ్చార్జ్ అయిన 15 రోజుల వరకు అయ్యే ఖర్చులు మొత్తం పథకంలో కవర్ అవుతాయి.
ఈ పథకానికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తోంది. సెప్టెంబర్ 29వ తేదీ వరకు ఈ పథకానికి ఏకంగా 35,54,67,164 మంది దరఖాస్తు చేసుకోవడం విశేషం. కాగా గడిచిన 24 గంటల్లో 44,779 మంది ఆయుష్మాన్ భారత్ పథకానికి అప్లై చేసుకున్నారు.
ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..
* ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://abdm.gov.in/లోకి వెళ్లాలి.
* ఆ తర్వాత ఆధార్ కార్డ్ లేదా రేషన్ కార్డ్‌ని కియోస్స్‌లో వెరిఫై చేసుకోవాలి.
* అనంతరం కుటుంబ గుర్తింపు కార్డులను అందజేయాలి.
* వెంటనే ఇ-కార్డు జనరేట్ అవుతుంది. ఈ కార్డుపై ప్రత్యేకమైన ఏబీ-పీఎంజేఏవై ఐడీ ఉంటుంది.
* ఆ తర్వాత పీఎంజేఏవై పోర్టల్‌లో ‘Am i eligible’ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి.
* వెంటనే beneficiary.nha.gov.in అనే వెబ్‌సైట్‌కి రీడైరెక్ట్ అవుతారు.
* అనంతరం అక్కడ కనిపించే క్యాప్చా, మొబైల్ నంబర్, ఓటీపీ ఎంటర్ చేయాలి.
* కైవైసీకి కోసం వివరాలు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ ఆయుష్మాన్ కార్డు జనరేట్ అవుతుంది. మీ బీమా కార్డును డౌన్‌లోడ్ చేసుకుంటే సరిపోతుంది.