Credit Card: క్రెడిట్‌ కార్డు వాడుతున్నారా.. ఈ విషయాలలో అలర్ట్‌గా లేకపోతే నష్టపోతారు!

Credit Card: నేటి ఆధునిక కాలంలో చాలామంది క్రెడిట్‌ కార్డులు వాడుతున్నారు. నిరంతర చెల్లింపులకు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.

Update: 2023-11-20 14:30 GMT

Credit Card: క్రెడిట్‌ కార్డు వాడుతున్నారా.. ఈ విషయాలలో అలర్ట్‌గా లేకపోతే నష్టపోతారు!

Credit Card: నేటి ఆధునిక కాలంలో చాలామంది క్రెడిట్‌ కార్డులు వాడుతున్నారు. నిరంతర చెల్లింపులకు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. వాస్తవానికి ఈ కార్డుల వల్ల లాభం ఎంత ఉందో నష్టం కూడా అంతే ఉంది. క్రెడిట్ కార్డులు తీసుకున్న వ్యక్తులు కొంత మొత్తాన్ని లిమిటెడ్‌ పీరియడ్‌కు ఉపయోగించుకునే అవకాశాన్ని పొందుతారు. కొన్ని రోజుల తర్వాత ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించాలి. అయితే క్రెడిట్ కార్డ్‌ల వాడకం పెరుగుతున్నందున మోసాలు కూడా పెరుగుతున్నాయి. ఇలా జరగకూడదంటే కొన్ని సేఫ్టీ టిప్స్‌ పాటించాలి. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

మీ క్రెడిట్ కార్డ్‌ని మీ దగ్గరే

మీ క్రెడిట్ కార్డును ఎవరికీ ఇవ్వొద్దు. ఎక్కడైనా చెల్లించవలసి వచ్చినప్పుడు మీరే చెల్లించండి. రెస్టారెంట్లు, పెట్రోల్ పంపులు మొదలైన ప్రదేశాల్లో కార్డు ఎవ్వరికీ ఇవ్వొద్దు. మీరే స్వైప్ చేయండి.

పిన్ మార్చాలి

క్రెడిట్ కార్డ్ పిన్‌ని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి. సులభంగా యాక్సెస్ చేయగల క్రెడిట్ కార్డ్ PINని పెట్టుకోవద్దు. క్రెడిట్ కార్డ్ పిన్ కొంచెం కష్టంగా ఉండాలి. అలాగే ప్రతి 6 నెలలకు ఒకసారి క్రెడిట్ కార్డ్ పిన్‌ని మార్చాలి. క్రెడిట్ కార్డ్ పిన్‌ నెంబరును ఎవరితోనూ షేర్‌ చేసుకోవద్దు.

అనుమానాస్పద వెబ్‌సైట్‌లను ఉపయోగించవద్దు

ఏదైనా అనుమానాస్పద వెబ్‌సైట్‌లో క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించవద్దు. ఆన్‌లైన్‌లో షాపింగ్ చేస్తున్నప్పుడు వెబ్‌సైట్ సురక్షితమా లేదా నిర్ధారించుకోవాలి.

నెలవారీ స్టేట్‌మెంట్ చెక్

క్రెడిట్ కార్డ్ నెలవారీ స్టేట్‌మెంట్‌ను తప్పకుండా చెక్‌ చేయాలి. ఇది మీ ఖర్చులను ట్రాక్ చేయడం సులభం చేస్తుంది. అంతేకాకుండా కార్డ్ ద్వారా ఏదైనా అనుమానాస్పద లావాదేవీ జరిగిందో లేదో తెలుస్తుంది.

Tags:    

Similar News