Save Money Tips: జీతం రాగానే ఖర్చు పెడుతున్నారా.. ఇలా ట్రై చేస్తే చాలా డబ్బు మిగులుతుంది..!

Save Money Tips: నేటి కాలంలో డబ్బు ఆదా చేయడం అందరికీ అవసరం. ఉద్యోగులు 30 రోజులుగా జీతం కోసం ఎదురు చూసి రాగానే మొత్తం ఖర్చుచేస్తున్నారు.

Update: 2023-11-16 12:59 GMT

Save Money Tips: జీతం రాగానే ఖర్చు పెడుతున్నారా.. ఇలా ట్రై చేస్తే చాలా డబ్బు మిగులుతుంది..!

Save Money Tips: నేటి కాలంలో డబ్బు ఆదా చేయడం అందరికీ అవసరం. ఉద్యోగులు 30 రోజులుగా జీతం కోసం ఎదురు చూసి రాగానే మొత్తం ఖర్చుచేస్తున్నారు. డబ్బులు వేటికి ఖర్చు పెట్టారో కూడా తెలియడం లేదు. అయితే ఒక ఫార్ములా పాటిస్తే చాలా డబ్బు పొదుపు చేయవచ్చు. దీనితో పాటు మీరు అన్ని సంతోషాలను పొందవచ్చు. నెలవారీ బడ్జెట్ చేయడానికి 50-30-20 నియమాన్ని అనుసరించాలి. దీనివల్ల జీవితం బాగుంటుంది.

50-30-20 ఫార్ములా

50-30-20 ఫార్మూలాను ఎలిజబెత్ వారెన్ ప్రారంభించారు. దీని గురించి ఒక పుస్తకంలో రాశారు. ఎలిజబెత్ వారెన్ తన కుమార్తెతో కలిసి 2006లో ఆల్ యువర్ వర్త్: ది అల్టిమేట్ లైఫ్‌టైమ్ మనీ ప్లాన్‌లో ఈ నియమం గురించి ప్రస్తావించారు. ఈ ప్లాన్‌ ప్రకారం దీనిని మూడు రకాలుగా విభజించారు. ఇందులో మొదటి భాగం అవసరం, రెండో భాగం కోరిక, మూడో భాగం పొదుపు.

బేసిక్‌ అవసరాలకు 50 శాతం

జీతం రాగానే మొదటగా మన ఆదాయంలో 50 శాతం అవసరాలకు ఖర్చు చేయాలి. అది లేకుండా మనం జీవించలేము. ఇందులో మీ ఇంటి రేషన్, కరెంటు బిల్లు, పిల్లల చదువులు, మొదలైన ఖర్చులు ఉంటాయి.

ఆనందం 30 శాతం

ఇది కాకుండా మీరు జీతంలో 30 శాతం మీ కోరికల కోసం ఖర్చు చేయవచ్చు. ఇవి మీరు నివారించగల ఖర్చులు. ఈ ఖర్చులను సంతోషం కోసం ఖర్చు చేస్తారు. సినిమాలు చూడటం, వాకింగ్‌కి వెళ్లడం, సెల్ఫ్ కేర్ చేయడం, షాపింగ్ చేయడం మొదలైనవి వంటివి.

20 శాతం పొదుపు

మీరు జీతంలో 20 శాతం పొదుపు చేయాలి. ఈ డబ్బును రిటైర్మెంట్‌ కోసం, పిల్లల ఉన్నత విద్యకు, పిల్లల వివాహాలు, అత్యవసర పరిస్థితుల కోసం ఉపయోగిస్తాం.

ఉదాహరణతో అర్థం చేసుకుందాం

మీరు ప్రతి నెలా రూ. 50,000 సంపాదిస్తారనుకుందాం. ఈ పరిస్థితిలో 50-30-20 నియమం ఇలా అప్లై చేయాలి. గృహ అవసరాలకు 50 శాతం అంటే రూ. 25,000 ఖర్చు చేయాలి. ఇందులో మీ ఇంటికి సంబంధించిన అన్ని ఖర్చులు ఉంటాయి. మీ కోరికలపై 30 శాతం అంటే రూ.15,000 ఖర్చు చేయవచ్చు. ఇందులో ప్రయాణం, సినిమాలు చూడటం, బట్టల కోసం షాపింగ్ మొదలైన అనేక విషయాలు ఉంటాయి. ఈ ఖర్చులన్నింటి తర్వాత 20 శాతం అంటే రూ.10,000 ఆదా చేయాలి. వీటిని FD చేయడం, NPS లో పెట్టుబడి పెట్టడం, SIP చేయడం చేయాలి.

Tags:    

Similar News