Married Plan: ఈ సీజన్‌లో పెళ్లి చేసుకోబోతున్నారా.. ఈ ఐడియా అమలుచేస్తే ఆర్థిక నష్టం ఉండదు..!

Married Plan: ప్రస్తుతం దేశంలో పెళ్లిళ్ల సీజన్‌ మొదలైంది. దీంతో పలు రకాల వ్యాపారులకు పండగనే చెప్పాలి. మీరు కూడా ఈ సీజన్‌లో వివాహం చేసుకోబోతున్నట్లయితే కచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి.

Update: 2023-11-03 16:00 GMT

Married Plan: ఈ సీజన్‌లో పెళ్లి చేసుకోబోతున్నారా.. ఈ ఐడియా అమలుచేస్తే ఆర్థిక నష్టం ఉండదు..!

Married Plan: ప్రస్తుతం దేశంలో పెళ్లిళ్ల సీజన్‌ మొదలైంది. దీంతో పలు రకాల వ్యాపారులకు పండగనే చెప్పాలి. మీరు కూడా ఈ సీజన్‌లో వివాహం చేసుకోబోతున్నట్లయితే కచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. నిజానికి పెళ్లి చేసుకునే ముందు ఫైనాన్షియల్‌ ప్లాన్ అనేది చాలా ముఖ్యం. లేదంటే చాలా ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. భవిష్యత్‌లో మీకు ఎలాంటి సమస్య రాకుండా ఉండాలంటే పెళ్లికి ముందు ఫైనాన్షియల్‌ ప్లానింగ్‌ ఎలా చేయాలో ఈరోజు తెలుసుకుందాం.

ఖర్చుల గురించి మాట్లాడండి

పెళ్లికి ముందు అబ్బాయి, అమ్మాయి తరపువారు ఖర్చులను బాగా అర్థం చేసుకోవాలి. ఇరు కుటుంబాలు కలిసి కూర్చుని మాట్లాడుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి కోసం పర్సనల్‌ లోన్‌ తీసుకోకూడదు. మీకు ఎడ్యుకేషన్ లోన్ బాకీ ఉన్నట్లయితే దానిని త్వరగా తిరిగి చెల్లించడానికి ప్లాన్ చేసుకోవాలి.

ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకోండి

వివాహానికి ముందు ఇంటి అవసరాలను తీర్చడానికి ముందుగానే ప్లాన్‌ చేసుకోవాలి. మీ భాగస్వామితో కూర్చుని కొన్ని విషయాలపై దృష్టి సారించి, ప్లాన్ చేసుకుంటే ఇన్వెస్ట్‌మెంట్‌ చేయడం సులభమవుతుంది. వివాహానికి ముందు ఇంటి ప్రధాన అవసరాల గురించి చర్చించుకోవాలి. పెళ్లికి ముందే దీని గురించి ప్లాన్ చేస్తే భవిష్యత్‌లో ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు.

బీమా ప్లాన్ లేదా మ్యూచువల్ ఫండ్

మీరు బీమా ప్లాన్‌ని ఎంచుకోవాలంటే మీ భాగస్వామిని కూడా పరిగణలోనికి తీసుకొని ప్లాన్ చేయాలి. అది ఇద్దరికీ ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే అది డబ్బు ఆదా చేయడానికి మంచి మార్గం అవుతుంది. మీరు ఎందులో ఇన్వెస్ట్‌ చేయడానికి అనుకూలంగా ఉన్నారో మీ భాగస్వామితో చర్చించాలి. వివిధ ప్రయోజనాలు, అప్రయోజనాలను లెక్కలోనికి తీసుకొని ఆప్షన్‌ ఎంచుకోవాలి.

ట్రావెలింగ్ ఫండ్‌

చాలా మంది ప్రజలు ట్రావెలింగ్ అంటే ఇష్టపడతారు. వివాహం తర్వాత బాధ్యతలు పెరుగుతాయి. కానీ జీవితాన్ని ఆనందించడం మానేస్తారని అర్థం కాదు. మీరు ప్రయాణం కోసం ఒక ఫండ్‌ని క్రియేట్‌ చేసుకోవచ్చు. ఇందులో ప్రతి నెలా కొంత డబ్బును ఆదా చేయాలి. తగినంత డబ్బు జమ అయినప్పుడు మీరు ఎక్కడికైనా వెళ్లవచ్చు. దీనివల్ల మీకు ఆకస్మిక ఖర్చుల భారం పడదు.

Tags:    

Similar News