Business Idea: ఉన్న ఊర్లోనే లక్షల్లో సంపాదించే అవకాశం.. బెస్ట్ బిజినెస్‌ ప్లాన్‌..!

Aloe Vera Farming Business: ఉద్యోగాల కోసం ఉన్న ఊరును వదిలి వెళ్తుంటారు. చాలా మందికి ఇది ఇష్టంలేకపోయినా తప్పని పరిస్థితుల్లో చేస్తుంటారు.

Update: 2024-06-27 10:30 GMT

Business Idea: ఉన్న ఊర్లోనే లక్షల్లో సంపాదించే అవకాశం.. బెస్ట్ బిజినెస్‌ ప్లాన్‌..!

Aloe Vera Farming Business: ఉద్యోగాల కోసం ఉన్న ఊరును వదిలి వెళ్తుంటారు. చాలా మందికి ఇది ఇష్టంలేకపోయినా తప్పని పరిస్థితుల్లో చేస్తుంటారు. అయితే ఊర్లోనే ఆదాయ మార్గాలు వెతుక్కుందామా.? అంటే ఆశించిన స్థాయిలో ఆదాయం సమకూరదు. ముఖ్యంగా వ్యాపారాలు చేయాలంటే గ్రామీణ ప్రాంతాల్లో పెద్దగా అవకాశాలు ఉండవనే ఆలోచనలో ఉంటారు.

అయితే సొంతూరులో స్థలం ఉండాలే కానీ లక్షల్లో ఆదాయం వచ్చే ఒక మంచి బిజినెస్‌ ఐడియా ఉంది. ఇంతకీ ఏంటా బిజినెస్‌ దీనివల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి.? ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం కలబంద వినియోగం భారీగా పెరిగింది. మెడిసిన్స్‌ మొదలు, సౌందర్య సాధానాల తయారీ వరకు కలబందను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఈ కలబంద సాగు చేయడం ద్వారా లక్షల్లో ఆదాయం ఆర్జించవచ్చు. ఈ వ్యాపారానికి పెద్దగా పెట్టుబడి కూడా అవసరం ఉండదు. లక్ష రూపాయల్లోనే ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు.

సుమారు ఎకరంన్నర భూమిలో కలబంద పంటను పండిస్తే కచ్చితంగా లక్షల్లో ఆదాయం పొందొచ్చు. కలబంద కేవలం 10 నెలల్లోనే కోతకు వస్తుంది. పెద్దపెద్ద కంపెనీలతో ఒప్పందం చేసుకుంటే నేరుగా మీ పొలం ఉన్న చోటుకే వచ్చి కలబందను కొనుగోలు చేస్తారు. దీంతో మీకు ట్రాన్స్‌పోర్ట్‌ ఖర్చులు కూడా మిగిలిపోతాయి. ఇసుక నేలల్లో కలబంద సాగు ఎక్కువగా వస్తుంది. అంతేకాకుండా ఈ పంట సాగుకు నీరు కూడా తక్కువగానే అవసరపడుతుంది.

ముఖ్యంగా జూన్‌-ఆగస్ట్‌ మధ్య కలబంద మొక్కల్ని నాటుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఒక ఎకరంన్నర భూమిలో కలబంద సాగుచేయడానికి సుమారు రూ. 30 వేల ఖర్చు అవుతుంది. ఇతర అన్ని ఖర్చులు కలుపుకుంటే రూ. లక్షలోపే పూర్తవుతుంది. ఈ పంట ద్వారా సుమారు 40 నుంచి 50 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో సుమారు టన్నుకు రూ. 20 వేల వరకు పలుకుతోంది. దీంతో 50 టన్నుల దిగుబడి వస్తే ఏకంగా రూ. 10 లక్షల ఆదాయం పొందొచ్చు. వ్యవసాయ రంగ నిపుణుల సూచనలు, వ్యాపారులతో ఒప్పందం చేసుకొని ఈ పంటను సాగు చేస్తే మీకు తిరుగు ఉండదనడంలో ఎలాంటి సందేహం లేదు. 

Tags:    

Similar News