LIC Customers: ఎల్‌ఐసీ కస్టమర్లకి అలర్ట్.. మార్చి 24 వరకు ఈ అవకాశం..!
LIC Customers: ఎల్‌ఐసీ పాలసీదారులు ఈ విషయంపై కొంచెం శ్రద్ధ వహించాలి.
LIC Customers: ఎల్‌ఐసీ పాలసీదారులు ఈ విషయంపై కొంచెం శ్రద్ధ వహించాలి. మీరు ఎల్‌ఐసీ పాలసీ తీసుకొని ప్రీమియం చెల్లించడం మర్చిపోయి ఉంటే ఇప్పుడు చెల్లించే అవకాశం వచ్చింది. కంపెనీ తరపున కస్టమర్లకు ఆగిపోయిన పాలసీ పునఃప్రారంభించే సదుపాయం అందిస్తోంది. దీంతోపాటు ఆలస్య రుసుములలో భారీ తగ్గింపులను పొందవచ్చు. ఇందుకు మార్చి 24 వరకు అవకాశం ఉంది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఎల్‌ఐసీ కస్టమర్లు ఉన్నారు. ఇందులో కొంతమంది ప్రీమియం చెల్లించడం మర్చిపోవడం లేదా చివరి తేదీ ముగిసిన తర్వాత గుర్తురావడం జరుగుతాయి. మీరు కూడా ఇదే పరిస్థితిలో ఉంటే అస్సలు టెన్షన్ పడకండి. 5 సంవత్సరాలలోపు ల్యాప్స్ అయిన పాలసీని సులువుగా పునరుద్దరించవచ్చు. పాలసీదారులు యులిప్, హై రిస్క్ పాలసీలను పునరుద్ధరించలేరని గుర్తుంచుకోండి. రీ-ఓపెనింగ్ కోసం అందులో ఒక అప్లికేషన్ ఇవ్వాలి. ఆ తర్వాత మూసివేత గురించి చెప్పాలి.
మీరు చెల్లింపును సకాలంలో చేయాలి ఎందుకంటే కొంతమంది పాలసీని తీసుకొని చెల్లింపు చేయడం మర్చిపోతారు. ఈ పరిస్థితిలో హోల్డర్ల రిస్క్ కవర్ కూడా ముగుస్తుంది. వారు పొందే డబ్బు వారికి సరైన సమయంలో అందదు. పాలసీదారు ఆలస్య రుసుముపై 30 శాతం వరకు తగ్గింపును పొందుతున్నారు. మీరు 1 లక్ష ప్రీమియంపై 25% తగ్గింపు, 3 లక్షల ప్రీమియంపై 30% తగ్గింపు పొందవచ్చు. పాలసీ ఆగిపోయిన కస్టమర్లు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మళ్లీ పునరుద్దరించుకోవచ్చు.