Aadhaar Card: క్యూఆర్‌ కోడ్‌తో మోసాలకు చెక్.. ఇంట్లోనే ఈజీగా ఆధార్‌ను వెరిఫై చేసుకోవచ్చు..!

Aadhaar Card: ప్రస్తుతం భారతదేశంలోని అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఆధార్ కార్డ్ ఒకటి. ఇది దేశంలో ఎక్కడైనా మీ గుర్తింపును రుజువు చేస్తుంది. ఐరిస్ స్కాన్, వేలిముద్ర, ఫొటో వంటి వివరాలు ఆధార్ కార్డుతో అనుసంధానించబడి ఉంటాయి.

Update: 2023-05-19 09:59 GMT

Aadhaar Card: క్యూఆర్‌ కోడ్‌తో మోసాలకు చెక్.. ఇంట్లోనే ఈజీగా ఆధార్‌ను వెరిఫై చేసుకోవచ్చు..

Aadhaar Card: ప్రస్తుతం భారతదేశంలోని అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఆధార్ కార్డ్ ఒకటి. ఇది దేశంలో ఎక్కడైనా మీ గుర్తింపును రుజువు చేస్తుంది. ఐరిస్ స్కాన్, వేలిముద్ర, ఫొటో వంటి వివరాలు ఆధార్ కార్డుతో అనుసంధానించబడి ఉంటాయి. అలాగే, ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఫైల్ చేయడానికి ఆధార్ కార్డ్, పాన్ లింక్ కలిగి ఉండటం అవసరం. UIDAI ఒక వ్యక్తి డెమోగ్రాఫిక్, బయోమెట్రిక్ డేటాను సేకరించడం ద్వారా ఆధార్ కార్డును జారీ చేస్తుంది. తద్వారా దేశంలోని పౌరులందరికీ నిర్దిష్ట ప్రభుత్వ ప్రయోజనాలు, రాయితీల కేటాయింపును పకడ్బందీగా అమలు చేసేలా చేస్తుంది.

ఆధార్‌లో 12 అంకెల వ్యక్తిగత గుర్తింపు సంఖ్య..

ఆధార్ నంబర్ ఇప్పటికీ యాక్టివ్‌గా ఉందా, డీయాక్టివేట్ అయిందా లేదా అని ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తుండాలి. ఈ విషయం మీకు తెలియకపోతే.. మేము వివరంగా చెబుతాం. వివిధ కారణాల వల్ల ఆధార్ కార్డ్ డియాక్టివేట్ కావొచ్చు. బయోమెట్రిక్స్‌లోని వివరాలతో సరిపోలకపోవడం లేదా మీ పిల్లలకు 5 సంవత్సరాలు, 15 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు వారి బయోమెట్రిక్‌లను అప్‌డేట్ చేయడంలో మీరు విఫలమైతే. అలాగే, నకిలీ ఆధార్ కార్డులను తయారు చేసేందుకు కొందరు మోసగాళ్లు ప్రయత్నిస్తుంటారు. అందుకే యూఐడీఏఐ వెరిఫికేషన్ సదుపాయాన్ని కల్పిస్తోంది. వెరిఫికేషన్ వల్ల మన దగ్గర ఒరిజినల్ ఆధార్ కార్డ్ ఉందో లేదో, కార్డ్‌లో సరైన వివరాలు ఉన్నాయో లేదో నిర్ధారించుకోవడానికి వీలు కల్పిస్తుంది.

QR కోడ్ ద్వారా ధృవీకరణ..

ముందుగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి mAadhaar యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.

యాప్‌ని ఓపెన్ చేసిన తర్వాత, స్క్రీన్ కుడి ఎగువ మూలలో కనిపించే QR కోడ్ చిహ్నంపై క్లిక్ చేయండి.

ఆధార్ కార్డుకు సంబంధించిన పూర్తి వివరాలు మీ ముందు ప్రత్యక్షమవుతాయి.

మీ పేరు ధృవీకరణ..

UIDAI వెబ్‌సైట్‌ని సందర్శించి, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో మీకు అందించిన నమోదు IDని నమోదు చేయండి.

మీరు సెక్యూరిటీ బాక్స్‌లో పొందే సెక్యూరిటీ కోడ్‌ను నమోదు చేసి, 'చెక్ స్టేటస్'పై క్లిక్ చేయండి.

మీరు స్క్రీన్‌పై మీ ఆధార్ నంబర్ లేదా ఆధార్ కార్డ్ స్థితిని చూడొచ్చు.

Tags:    

Similar News