PMSBY: నెలకి ఒక్క రూపాయితో రూ.2 లక్షల బీమా ప్రయోజనం..!

PMSBY: గతంలో ధనవంతులు లేదా మధ్యతరగతి వ్యక్తులు మాత్రమే బీమా పాలసీలను తీసుకునేవారు.

Update: 2022-04-25 14:30 GMT

PMSBY: నెలకి ఒక్క రూపాయితో రూ.2 లక్షల బీమా ప్రయోజనం..!

PMSBY: గతంలో ధనవంతులు లేదా మధ్యతరగతి వ్యక్తులు మాత్రమే బీమా పాలసీలను తీసుకునేవారు. కానీ మారుతున్న కాలంతో పాటు ప్రభుత్వం, వివిధ బీమా కంపెనీలు తక్కువ ఆదాయ వర్గాల ప్రజల కోసం బీమా పాలసీలను తీసుకురావడం ప్రారంభించాయి. ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన కింద ప్రతి సంవత్సరం 12 రూపాయలు చెల్లిస్తే ప్రతిఫలంగా రూ.2 లక్షల బీమా పొందుతాడు. దీని ప్రకారం మీరు ప్రతి నెలా కేవలం 1 రూపాయి మాత్రమే ఖర్చు చేయాలి. ఈ పథకం కింద బీమా చేయబడిన వ్యక్తి మరణిస్తే నామినీకి 2 లక్షల రక్షణ లభిస్తుంది. మరోవైపు అతను ప్రమాదంలో వికలాంగుడైనట్లయితే 1 లక్ష వరకు పాక్షిక కవరేజీని పొందుతాడు.

ఈ పథకాన్ని ప్రభుత్వం 2015 సంవత్సరంలో ప్రారంభించింది. ఈ పథకం ద్వారా దేశంలోని ప్రతి వ్యక్తికి సామాజిక భద్రత ప్రయోజనాలను అందించాలని ప్రభుత్వం కోరుకుంటుంది. ఈ పథకాన్ని తీసుకోవడానికి మీ వయస్సు 18 నుంచి 70 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ పాలసీ టర్మ్ ప్లాన్ ఇది ఒక సంవత్సరం తర్వాత ముగిసిపోతుంది. రూ.12 చెల్లించి ప్రతి సంవత్సరం రెన్యూవల్ చేసుకోవాలి. ఈ పథకం జూన్ 1 నుంచి మే 31 వరకు చెల్లుబాటు అవుతుంది.

క్లెయిమ్ విధానం

ఈ బీమాను కొనుగోలు చేయడానికి పెట్టుబడిదారులు ఒక ఫారమ్‌ను పూరించాలి. దీంతో పాటు మీరు మీ ఖాతా సమాచారాన్ని అందివ్వాలి. మే 31 వరకు ఖాతాదారుడి ఖాతా నుంచి 12 రూపాయలు కట్‌ అవుతాయి. బీమా చేసిన వ్యక్తి ప్రమాదంలో మరణిస్తే 30 రోజులలోపు పాలసీని క్లెయిమ్ చేసుకోవచ్చు. దీంతో 60 రోజుల్లోనే పాలసీ సెటిల్‌మెంట్‌ జరుగుతుంది.

Tags:    

Similar News