Top 6 News Of The Day: కర్నూల్ లో హైకోర్టు బెంచ్ : మరో ఐదు ముఖ్యాంశాలు

Update: 2024-09-23 12:46 GMT

1. కర్నూల్ లో హైకోర్టు బెంచ్ ప్రతిపాదనలు

కర్నూల్ లో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్దం చేయనుంది. త్వరలోనే నిర్వహించే కేబినెట్ సమావేశంలో ఈ విషయమై ఆమోదం తెలిపే కేంద్రానికి పంపుతామని చంద్రబాబు చెప్పారు.న్యాయశాఖపై ఏపీ సీఎం చంద్రబాబు సోమవారం సమీక్ష నిర్వహించారు. అమరావతిలో 100 ఎకరాల్లో లా కాలేజీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. జూనియర్ న్యాయవాదులకు 10 వేల గౌరవ వేతనం ఇవ్వాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది.

2. ఆస్కార్ 2025: ఇండియా నుంచి ఎంపికైన లాపతా లేడీస్

లాపతా లేడీస్ సినిమాను ఆస్కార్ 2025 పోటీలకు ఇండియా నుంచి ఎంపికైంది. బాలీవుడ్ నటులు అమిర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ విషయాన్ని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధికారికంగా ప్రకటించింది. 2001 సంవత్సరంలో గ్రామీణ ప్రాంతానికి చెందిన నవ వధువులు రైలు ప్రయాణంలో తారుమారైన ఘటన లాపతా టేడీస్ గా తెరకెక్కించారు. ఈ సినిమాను అమిర్ ఖాన్ నిర్మించారు. టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకలో గత ఏడాది ఈ సినిమాను ప్రదర్శించారు.

3. ధర్మవరంలో సబ్ జైలు వద్ద ఉద్రిక్తత

ధర్మవరంలో వైఎస్ఆర్ సీపీ, బీజేపీ వర్గీయుల మధ్య సోమవారం ఘర్షణ చోటు చేసుకుంది. జైలులో ఉన్న తమ పార్టీ కార్యకర్తను పరామర్శించేందుకు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సబ్ జైలు వద్దకు వచ్చిన సమయంలో ఈ ఘర్షణ తలెత్తింది. వాహనాలు అడ్డుగా ఉన్నాయనే కారణంగా ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. కేతిరెడ్డి వర్గీయులు దురుసుగా వ్యవహరించారని హరీష్ వర్గీయులు ఆరోపిస్తున్నారు. జైలు నుంచి కేతిరెడ్డి వెళ్లే సమయంలో బీజేపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఓ కార్యకర్త కేతిరెడ్డి కారును ముందుకు కదలకుండా ఉండేలా బానెట్ పైకి ఎక్కారు. డ్రైవర్ వేగంగా.

4. ఫ్రిజ్ లో మహిళ డెడ్ బాడీ ..బెంగుళూరులో కలకలం

శ్రద్దావాకర్ హత్య మాదిరిగానే బెంగుళూరులో మహాలక్ష్మి అనే 29 ఏళ్ల మహిళను చంపి 30కి పైగా ముక్కలుగా కోసి ఫ్రిజ్ లో పెట్టిన ఘటన కలకలం రేపుతోంది. ఈ కేసుతో సంబంధం ఉన్న వ్యక్తి బెంగాల్ కు చెందినవాడుగా అనుమానిస్తున్నట్టుగా పోలీసులు చెప్పారు. నిందితుడిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని చెప్పారు. మృతురాలు బెంగుళూరులోని వయ్యాలి కావల్ ప్రాంతంలో ఒంటరిగా ఉంటుంది. నిందితుడి కోసం పోలీసులు ఆరు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టాయి.

5. కాళేశ్వరంపై విచారణకు రావాలని ఇంజనీర్లకు జస్టిస్ ఘోష్ కమిషన్ ఆదేశం

కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ బ్యారేజీపై జస్టిస్ ఘోష్ కమిషన్ మళ్లీ దర్యాప్తు ప్రారంభించనుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో పనిచేసిన ఇంజనీర్లను విచారించనుంది. సెప్టెంబర్ 24 నుంచి విచారణకు రావాలని ఇంజనీర్లను ఘోష్ కమిషన్ కోరింది. విచారణను తప్పుదోవపట్టించే విధంగా ఉన్న వారిపై కేసులు నమోదు చేయాలని కమిషన్ భావిస్తోంది.

6. తిరుమలలో శాంతి హోమం

తిరుమల ఆలయంలో జరిగిన దోషాలకు ప్రాయశ్చిత్తంగా సోమవారం ప్రాయశ్చితం చేశారు. దీంతో పాటు పంచగవ్య ప్రోక్షణ చేసినట్టు టీటీడీ ఈవో జె. శ్యామలరావు తెలిపారు. లడ్డు తయారీ కోసం ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని గుర్తించిన నేపథ్యంలో ఈ శాంతి హోమం నిర్వహించారు.

Tags:    

Similar News