Karimnagar Government Hospital : కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల కొరత
Karimnagar Government Hospital : నాలుగు జిల్లాలకు అదే పెద్దాసుపత్రి. ఇప్పుడున్న కోవిడ్ పరిస్దితులకైనా లేదంటే మాములుగా వచ్చే ఎలాంటి ఆరోగ్య సమస్యలకైనా చాలా మంది పేదలు ఇక్కడికే వస్తారు అయితే ఇంతలా ఉన్న ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో వసతుల కొరత మాత్రం వెంటాడుతూనే ఉంది. కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి పై హెచ్ ఎం టీవి స్పెషల్ స్టోరి.
ఇదీ కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి. గత 40 ఏళ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు పక్క జిల్లాల సరిహద్దు గ్రామీణ ప్రాంత ప్రజలు కూడా వైద్యం కోసం వస్తారు. కోవిడ్ సమయంలోనూ ఈ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి కీలకంగా మారింది. అంత మందికి వైద్యం అందిస్తున్న వసతులు, వైద్యుల కొరత మాత్రం అలానే ఏళ్లుగా వెంటాడుతున్నాయి.
మాములు రోగులకు చికిత్స అందిస్తూనే ఇప్పుడు కరోనా రోగులకి ప్రత్యేకంగా వైద్యం అందించేందుకు హాస్పిటల్ ని రెండుగా విభజించారు. ముందు భాగం కొవిడ్ శాంపిల్స్ కలెక్షన్, ఐసోలేషన్ వార్డు, ట్రీట్ మెంట్ వార్డ్ ఏర్పాటు చేశారు. వెనక భాగం అంతా జనరల్ గా వచ్చే రోగులకు వైద్యం అందిస్తున్నారు. కరోనా కోసం ప్రత్యేకంగా వంద పడకలను ఏర్పాటు చేసేందుకు కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతానికి 35 బెడ్స్...20 ప్రత్యేక గదులు ఏర్పాటు చేశారు.
ఇలా వైద్యులు, సిబ్బంది కొరత మాత్రం ఈ హాస్పిటల్ ని వీడటం లేదు. రానున్నది మరింతా గడ్డుకాలంగా ఉండొచ్చనే అనుమానాలు అందరికి కలుగుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితులు కూడా అలాంటి సంకేతాలే ఇస్తున్నాయి. ఇలాంటి పరిస్దితుల్లో కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో బెడ్స్ పెంచడంతో పాటుగా వెంటనే యుద్దప్రాతిపదికన వైద్యులను బర్తీ చేసి శానిటేషన్ సిబ్బందిని నియమించాలని కోరుతున్నారు.