ఏపీలో ఎన్నికల నిర్వహణపై హైకోర్టు కీలక ఆదేశాలు.
ఏపీలో ఎన్నికల నిర్వహణపై హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది.
ఏపీలో ఎన్నికల నిర్వహణపై హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌ను ప్రభుత్వం నుంచి ముగ్గురు అధికారుల బృందం కలవాలంది ధర్మాసనం. రాష్ట్రంలో కరోనా ఎఫెక్ట్, ఎన్నికల నిర్వహణ గురించి చర్చించి ఎస్‌ఈసీ నిర్ణయం తీసుకుంటారన్న హైకోర్టు.. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సహకరించాలంది. దీనికి సంబంధించిన ఆదేశాలు ఈనెల 29న రానున్నాయి.
కొద్ది రోజులుగా స్థానిక ఎన్నికల అంశం ఎస్‌ఈసీ, ఏపీ సర్కార్ మధ్య వివాదాన్ని రేపింది. ఈ వివాదంలో గతంలో ఎస్‌ఈసీని కూడా మార్చింది ప్రభుత్వం. ఆ తర్వాత కోర్టు ఆదేశాలతో తిరిగి నిమ్మగడ్డ రమేశ్‌నే ఎస్‌ఈసీగా నియమించినా.. ఎన్నికల నిర్వహణకు మాత్రం సుముఖత వ్యక్తం చేయలేదు.
ఎస్‌ఈసీగా తిరిగి బాధ్యతలు చేపట్టిన నిమ్మగడ్డ అప్పటినుంచి ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వాన్ని సంప్రదించాలని చూశారు. ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించాలని పలుమార్లు ప్రభుత్వానికి లేఖ రాశారు. అయితే ఇందుకు కొవిడ్ కారణం చూపుతూ ప్రభుత్వం నిమ్మగడ్డ ప్రతిపాదనలను తిరస్కరిస్తూ వచ్చింది. ఈ టైమ్‌లో రిస్క్ తీసుకోలేమంటూ సీఎస్ నీలం సాహ్ని లేఖ రాశారు. దాంతో ఈ వ్యవహారం కోర్టుకు చేరింది. ఇక ఇవాళ కోర్టు ఈ అంశంపై ఆదేశాలు జారీ చేయటంతో ఈ వివాదానికి దాదాపు ఫుల్ స్టాప్ పడినట్లయింది.