VinFast VF3 EV: చవక ధరకే చిట్టి ఎలక్ట్రిక్ కారు.. విన్‌ఫాస్ట్ VF3 వచ్చేస్తుంది.. పొట్టిదైనా చాలా గట్టిది..!

VinFast VF3 EV: భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరిగినప్పటి నుండి, కొత్త మోడల్స్ మార్కెట్లోకి రావడం ప్రారంభించాయి.

Update: 2025-04-02 07:15 GMT

VinFast VF3 EV: చవక ధరకే చిట్టి ఎలక్ట్రిక్ కారు.. విన్‌ఫాస్ట్ VF3 వచ్చేస్తుంది.. పొట్టిదైనా చాలా గట్టిది..!

VinFast VF3 EV: భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరిగినప్పటి నుండి, కొత్త మోడల్స్ మార్కెట్లోకి రావడం ప్రారంభించాయి. చాలా కంపెనీలు భారతీయ కార్ మార్కెట్‌లో సరసమైన ఎలక్ట్రిక్ కార్లను కూడా తయారు చేస్తున్నాయి. అంతే కాదు విదేశీ కంపెనీలు కూడా ఈ విభాగంలోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పుడు వియత్నాం ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ విన్‌ఫాస్ట్ భారతదేశంలో తన మొట్టమొదటి చిన్న ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ VF3ని త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది ఆటో ఎక్స్‌పోలో కంపెనీ ఈ కారును ఆవిష్కరించింది. ఇది ఎంజీ కామెట్ ఈవీతో పోటీపడుతుంది. కొత్త VinFast VF3 EVలో ఎటువంటి ఫీచర్స్ ఉంటాయో తెలుసుకుందాం.

VinFast VF3 EV Batery

విన్‌ఫాస్ట్ VF3 ఎలక్ట్రిక్ కారులో 18.64 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌ ఉంటుంది. ఈ బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్‌లో 215 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. 5.3 సెకన్లలో గంటకు 0 నుండి 50 కి.మీ వేగాన్ని అందుకోగలదు. ఈ 4-సీటర్ ఎలక్ట్రిక్ కారు రెండు-డోర్ల ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్. సిటీ డ్రైవ్‌ను దృష్టిలో ఉంచుకుని డిజైన్ చేశారు. VF3 ఎలక్ట్రిక్ కారు ముందు భాగంలో ఫ్లోటింగ్ రూఫ్ , బ్లాక్-అవుట్ పిల్లర్లు వి-ఆకారపు గ్రిల్, క్రోమ్ ఫినిషింగ్ డిజైన్‌తో కనిపిస్తాయి.

VinFast VF3 EV Features

కొలతల విషయానికి వస్తే VF3 ఎలక్ట్రిక్ కారు పొడవు 3,190మిమీ, వెడల్పు 1,679మిమీ, ఎత్తు 1,652మిమీ. దీని వీల్‌బేస్ 2,075మిమీ, గ్రౌండ్ క్లియరెన్స్ 191మిమీ. ఇంటీరియర్ గురించి చెప్పాలంటే దీనికి 10-అంగుళాల ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఇవ్వచ్చు. అంతే కాకుండా, మాన్యువల్ ఎయిర్ కండిషనింగ్, 2-స్పోక్ స్టీరింగ్ వీల్ వంటి ఫీచర్లు కనిపిస్తాయి. భద్రత కోసం 2 ఎయిర్‌బ్యాగ్స్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, డిస్క్ బ్రేక్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, చైల్డ్ సీట్ మౌంట్, రివర్స్ పార్కింగ్ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్-హోల్డ్ అసిస్ట్ వంటి ఫీచర్లు అందించారు.

VinFast VF3 EV Price

విన్‌ఫాస్ట్ VF3 ధర రూ. 10 లక్షల ఎక్స్-షో రూమ్‌గా ఉండే అవకాశం ఉంది. ఎంజీ కామెట్ ఈవీ ధర రూ. 7 లక్షలు ఎక్స్-షోరూమ్. మీరు బ్యాటరీ రేంజ్ ప్రోగ్రామ్ కింద కామెట్ ఈవీని కూడా రూ. 4.99 లక్షల ప్రారంభ ధరతో కొనుగోలు చేయవచ్చు.

Tags:    

Similar News