Cheapest Diesel Cars: చౌకైన డీజిల్ కార్లు.. మైలేజ్, ఫీచర్స్‌లో టాప్.. కళ్లు మూసుకొని కొనేయొచ్చు..!
Cheapest Diesel Cars: భారతీయ ఆటో మార్కెట్‌లో డీజిల్ కార్లకు తమదైన ఆదరణ ఉంది.

Cheapest Diesel Cars: చౌకైన డీజిల్ కార్లు.. మైలేజ్, ఫీచర్స్‌లో టాప్.. కళ్లు మూసుకొని కొనేయొచ్చు..!
Cheapest Diesel Cars: భారతీయ ఆటో మార్కెట్‌లో డీజిల్ కార్లకు తమదైన ఆదరణ ఉంది. అద్భుతమైన ఇంధన సామర్థ్యం, మెరుగైన పనితీరు కారణంగా, చాలా మంది వినియోగదారులు ఇప్పటికీ డీజిల్ ఇంజిన్ వాహనాలను కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు. అయితే కఠినమైన ఉద్గార నిబంధనల కారణంగా, వాటి అమ్మకాలు స్వల్పంగా క్షీణించాయి. మీరు కూడా బడ్జెట్-ఫ్రెండ్లీ డీజిల్ కారు కొనాలని చూస్తున్నట్లయితే దేశంలో రూ. 10 లక్షలలోపు లభించే 5 అత్యంత సరసమైన డీజిల్ కార్ల గురించి తెలుసుకుందాం.
1. Tata Altroz
టాటా ఆల్ట్రోజ్ డీజిల్ ఇంజిన్‌తో వచ్చే కార్లలో ఒకటి. ఇందులో 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ ఉంది. ఈ ఇంజిన్ 89 బిహెచ్‌పి పవర్, 200 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది, 23.6 kmpl మైలేజీని ఇస్తుంది. ఫీచర్ల విషయానికి ఇందులో 10.24-అంగుళాల టచ్‌స్క్రీన్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే వంటివి ఉన్నాయి. అలానే సేఫ్టీ విషయానికి వస్తే 6-ఎయిర్‌బ్యాగ్స్, 360-డిగ్రీ కెమెరా,వెంటిలేటెడ్ సీట్లు వంటి ప్రీమియం ఫీచర్‌లను చూడచ్చు.
2. Mahindra Bolero
గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఇష్టపడే మహీంద్రా బొలెరో ఒక పవర్ ఫుల్ ఎస్‌యూవీ. ఇందులో 1.5-లీటర్ mHawk75 డీజిల్ ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ 75 బిహెచ్‌పి పవర్, 210 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది . 16 kmpl మైలేజీని ఇస్తుంది. దీని బలమైన బాడీ, అధిక గ్రౌండ్ క్లియరెన్స్, ఎకనామిక్ మెయింటెనెన్స్ దీనిని ప్రత్యేకం చేస్తాయి. ఈ కారణంగా గుంతల రోడ్లు, గ్రామీణ ప్రాంతాలలో బాగా పని చేస్తుంది.
3. Mahindra Bolero Neo
మహీంద్రా బొలెరో కొంచెం ప్రీమియం వెర్షన్ కావాలనుకునే కస్టమర్లకు ఒక గొప్ప ఎంపిక. ఇందులో 1.5-లీటర్ mHawk డీజిల్ ఇంజన్ కూడా ఉంది, అయితే దీని మైలేజ్ 17.29 kmplకి చేరుకుంటుంది. 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. ఆధునిక డిజైన్, మంచి గ్రౌండ్ క్లియరెన్స్, సుపీరియర్ రైడ్ క్వాలిటీ దీనిని ప్రీమియం ఎస్‌యూవీగా మార్చింది.
4.Mahindra XUV 3XO
మహీంద్రా ఈ డీజిల్ కారులో1.5-లీటర్ టర్బోచార్జ్డ్ CRDe ఇంజన్ ఉంది. ఈ ఇంజిన్ 115 బిహెచ్‌పి పవర్, 300 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఏమ్‌టీ ట్రాన్స్‌మిషన్ ఎంపికలతో వస్తుంది. 21.2 kmpl మైలేజీని అందిస్తుంది. ఫీచర్ల విషయానికి వస్తే ఇందులో అడాస్, 6-ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, 360-డిగ్రీ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి. ఇది కాకుండా, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు వంటి ప్రీమియం ఫీచర్లు కూడా అందించారు.
5. Kia Sonet
మీరు స్టైలిష్, ఫీచర్-లోడెడ్ డీజిల్ కారు కోసం చూస్తున్నట్లయితే, కియా సోనెట్ ఒక గొప్ప ఎంపిక. ఇందులో 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ ఉంది, ఇది 114 బిహెచ్‌పి పవర్, 250 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్, టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. 24.1 kmpl వరకు అద్భుతమైన మైలేజీని ఇస్తుంది. ఫీచర్ల విషయానికి వస్తే 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్, బోస్ సౌండ్ సిస్టమ్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, 360-డిగ్రీ కెమెరా, లెవెల్-1 అడాస్ వంటి ఆధునిక ఫీచర్లు అందించారు.