Mahindra Bolero: కొత్త మహీంద్రా బొలెరో.. రాయల్ లుక్ అదిరిపోయింది.. లాంచ్ ఎప్పుడంటే..?

Mahindra Bolero: మహీంద్రా అండ్ మహీంద్రా బొలెరో అనేది భారతీయ మార్కెట్లో చాలా ప్రజాదరణ పొందిన ఎస్‌యూవీ.

Update: 2025-04-01 07:00 GMT

Mahindra Bolero: మహీంద్రా అండ్ మహీంద్రా బొలెరో అనేది భారతీయ మార్కెట్లో చాలా ప్రజాదరణ పొందిన ఎస్‌యూవీ. ఇది నగరాల నుండి గ్రామాల వరకు బలమైన పట్టును కొనసాగిస్తోంది. ఈ ఎస్‌యూవీ చాలా సంవత్సరాలుగా ప్రజల అభిమానాన్ని దక్కించుకుంటుంది. ఇప్పుడు కంపెనీ దీనిని కొత్త అవతార్‌లో పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తోంది. కొత్త తరం మహీంద్రా బొలెరో మల్టీ సీటింగ్ లేఅవుట్‌లలో మార్కెట్లోకి రానుంది.

కొత్త తరం మహీంద్రా బొలెరో 2025 చివరిలో లేదా 2026 ప్రారంభంలో విడుదల చేయచ్చని భావిస్తున్నారు. అయితే, కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. లగ్జరీ ఇంటీరియర్, శక్తివంతమైన ఇంజన్, అధునాతన ఫీచర్లు ఉండనున్నాయి. ఈ కొత్త జనరేషన్ బొలేరో గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Mahindra Bolero Features

కొత్త తరం బొలెరో సరికొత్త U171 ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. కంపెనీ ఈ ప్లాట్‌ఫామ్‌లో మూడు ఎస్‌యూవీలను విడుదల చేయనుంది.ఈ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా బొలెరో మొదటి మోడల్‌గా ఉంటుందని భావిస్తున్నారు. కొత్త మహీంద్రా బొలెరోకు ఆధునిక సాంకేతికత, ఫీచర్లు అందించే అవకాశం ఉంది. పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌, యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో ఉంటాయి.

ఇది కాకుండా, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, మెరుగైన సీటింగ్ సౌకర్యం వంటి ఫీచర్లను అందించవచ్చు. భద్రత పరంగా ఎస్‌యూవీలో మల్టీ ఎయిర్‌బ్యాగ్స్, 360-డిగ్రీ కెమెరా, పార్కింగ్ సెన్సార్లు, యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ,సీట్ బెల్ట్ అలర్ట్ వంటి ఫీచర్లు ఉండచ్చు.

కొత్త బొలెరోలో మూడు ఇంజన్ ఆప్షన్లు ఉండే అవకాశం ఉంది.1.5 లీటర్ టర్బో డీజిల్ ఇంజన్, 2.2 లీటర్ టర్బో డీజిల్ ఇంజన్, 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ ఇవచ్చు. ఈ పవర్ ఫుల్ ఇంజన్లు సిటీ రోడ్ల నుండి ఆఫ్-రోడింగ్ వరకు అద్భుతమైన పనితీరును అందిస్తాయి. మొత్తంమీద కొత్త మహీంద్రా బొలెరో శక్తివంతమైన ఎస్‌యూవీగా మారనుంది.

Tags:    

Similar News