Maruti Suzuki E Vitara: కొంటే ఇలాంటి కారు కొనాలి.. ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు రేంజే వేరబ్బా.. సింగిల్ ఛార్జ్‌తో 500కిమీ దూసుకెళ్తుంది..!

Maruti Suzuki E Vitara: ఏప్రిల్ 2025 భారతదేశంలోని కార్ మార్కెట్‌కు ఒక ముఖ్యమైన నెల కానుంది, ఎందుకంటే ఆటో ఎక్స్‌పో 2025 సమయంలో పరిచయం చేసిన మారుతి సుజుకి ఈ విటారాతో సహా అనేక కార్లు ఈ నెలలో లాంచ్ కానున్నాయి.

Update: 2025-04-02 14:30 GMT

Maruti Suzuki E Vitara: కొంటే ఇలాంటి కారు కొనాలి.. ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు రేంజే వేరబ్బా.. సింగిల్ ఛార్జ్‌తో 500కిమీ దూసుకెళ్తుంది..!

Maruti Suzuki E Vitara: ఏప్రిల్ 2025 భారతదేశంలోని కార్ మార్కెట్‌కు ఒక ముఖ్యమైన నెల కానుంది, ఎందుకంటే ఆటో ఎక్స్‌పో 2025 సమయంలో పరిచయం చేసిన మారుతి సుజుకి ఈ విటారాతో సహా అనేక కార్లు ఈ నెలలో లాంచ్ కానున్నాయి. కానీ దాని ధరలు వెల్లడించలేదు. ఆటో ఎక్స్‌పోలో అందిన సమాచారం ప్రకారం.. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్‌ను ఆఫర్ చేస్తోంది.

మారుతి సుజికి ఈ విటారాలో 49 కిలోవాట్, 61 కిలోవాట్ రెండు బ్యాటరీ ప్యాక్స్ ఉన్నాయి. ఒక్కసారి ఛార్జింగ్‌ చేస్తే దాదాపు 500 కిలోమీటర్లు నడుస్తుంది. కంపెనీ మారుతి ఈ విటారాను ఆధునిక ఎలక్ట్రిక్ ఎస్‌యూవీగా తయారు చేసింది. దీనిలో డ్యూయల్ స్క్రీన్, స్ప్లిట్-ఫోల్డింగ్ సీట్, అడ్జస్టబుల్ హెడ్‌రెస్ట్, త్రీ-పాయింట్ సీట్ బెల్ట్, ఐసోఫిక్స్ చైల్డ్‌తో కూడిన కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ అందించారు.

ఇది కాకుండా ఈ విటారాలో అందుబాటులో ఉన్న అధునాతన ఫీచర్ల గురించి మాట్లాడినట్లయితే.. ఇందులో ఆటో హోల్డ్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ట్రైల్ డ్రైవ్ మోడ్, హిల్ డిసెంట్ కంట్రోల్, సింగిల్-జోన్ ఆటో క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, సైడ్, కర్టెన్ ఎయిర్‌బ్యాగ్‌లు, హీటెడ్ మిర్రర్స్, అడ్వాన్స్‌డ్ డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టమ్ ఉన్నాయి.

మారుతి ఈ విటారా పవర్ విషయానికి వస్తే.. సింగిల్-మోటార్ 49కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ 144 హెచ్‌పి పవర్, సింగిల్-మోటార్ 61కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ 174 హెచ్‌పి పవర్ రిలీజ్ చేస్తుంది. ఈ రెండు బ్యాటరీ వేరియంట్‌ల ద్వారా ఉత్పత్తి చేసిన గరిష్ట టార్క్ 189 ఎన్ఎమ్.

మారుతి విటారా ఎలక్ట్రిక్ 4,275 మిమీ పొడవు, 1,800 మిమీ వెడల్పు, 1,635 మిమీ ఎత్తు ఉంటుంది. దీనితో 2,700 మిమీ వీల్ బేస్ అందుబాటులో ఉంది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 180 మిమీ,బరువు 1,702 కిలోల నుండి 1,899 కిలోల మధ్య ఉంటుంది. బరువు వేరియంట్లను బట్టి మారే అవకాశం ఉంది.

Tags:    

Similar News