Tiguan R-line Launch: కొత్త కారు లాంచ్.. వోక్స్‌వ్యాగన్ టిగువాన్ R-లైన్ భలే ఉందిగా.. ప్రీ బుకింగ్స్ ఓపెన్.. ధర, ఫీచర్లు ఇవే..!

Tiguan R-line Launch: భారతీయ మార్కెట్లో ఎస్‌యూవీ సెగ్మెంట్ వాహనాలను జనాలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని కంపెనీలు అనేక పరిమాణాలలో ఎస్‌యూవీలను విక్రయిన్నాయి.

Update: 2025-04-14 15:30 GMT
Tiguan R-line

Tiguan R-line Launch: కొత్త కారు లాంచ్.. వోక్స్‌వ్యాగన్ టిగువాన్ R-లైన్ భలే ఉందిగా.. ప్రీ బుకింగ్స్ ఓపెన్.. ధర, ఫీచర్లు ఇవే..!

  • whatsapp icon

Tiguan R-line Launch: భారతీయ మార్కెట్లో ఎస్‌యూవీ సెగ్మెంట్ వాహనాలను జనాలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని కంపెనీలు అనేక పరిమాణాలలో ఎస్‌యూవీలను విక్రయిన్నాయి. వోక్స్‌వ్యాగన్ రేపు భారత మార్కెట్లో వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆర్ లైన్ ఎస్‌యూవీని అధికారికంగా విడుదల చేయనుంది. ఈ ఎస్‌యూవీలో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి? దానిలో ఎటువంటి ఇంజిన్ ఉంటుంది? దీన్ని ఎంత ధరకు లాంచ్ చేయవచ్చు? తదితర వివరాలు తెలుసుకుందాం.

Tiguan R-line Launch Date

టిగువాన్ ఆర్-లైన్ ఎస్‌యూవీ ఈరోజు అధికారికంగా లాంచ్ కానుంది.ఈ ఎస్‌యూవీని వోక్స్‌వ్యాగన్ ఫుల్ సైజు ఎస్‌యూవీ విభాగంలోకి తీసుకురానుంది. దీని కోసం బుకింగ్ ఇప్పటికే ప్రారంభమైంది.

Tiguan R-line Engine

వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆర్ లైన్ 2-లీటర్ TSI Evo ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్‌తో ఎస్‌యూవీ 204 పిఎస్ పవర్, 320 న్యూటన్ మీటర్ల టార్క్‌ రిలీజ్ చేస్తుంది. దీనికి 7 స్పీడ్ DSG ట్రాన్స్‌మిషన్ అందించారు. దీనితో పాటు, దీనికి 4 మోషన్ ఆల్ వీల్ డ్రైవ్ సామర్థ్యం ఉంది, దీని కారణంగా దీనిని ఏ రకమైన రోడ్డుపైనైనా నడపచ్చు.

Tiguan R-line Features And Specifications

వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆర్ లైన్‌లో 15-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ స్క్రీన్ అందించారు. దీనితో పాటు, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, IDA వాయిస్ అసిస్టెంట్, రోటరీ కంట్రోలర్‌తో కూడిన స్క్రీన్, ఎనిమిది స్పీకర్ ఆడియో సిస్టమ్, హెడ్-అప్ డిస్‌ప్లే వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి.

దీనితో పాటు, మల్టీ జోన్ క్లైమేట్ కంట్రోల్, రెండు వైర్‌లెస్ ఛార్జింగ్ పాడ్‌లు, యాంబియంట్ లైట్, పనోరమిక్ సన్‌రూఫ్, మ్యాట్రిక్స్ హెడ్‌లైట్, ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్, ఎల్‌ఈడి డిఆర్ఎల్, రూఫ్ రైల్ వంటి ఫీచర్లు ఉంటాయి. భద్రత కోసం ఎస్‌యూవీ తొమ్మిది ఎయిర్‌బ్యాగ్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, హిల్ స్టార్ట్ అసిస్ట్, హిల్ డీసెంట్ కంట్రోల్, ముందు,వెనుక డిస్క్ బ్రేక్‌లు, 21 ఫీచర్లతో లెవల్ 2 అడాస్ వంటి భద్రతా ఫీచర్లు అందించారు.

Tiguan R-line Prie

ప్రస్తుతానికి వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆర్ లైన్ ఖచ్చితమైన ధర అందుబాటులో లేదు. కానీ దీని ఎక్స్-షోరూమ్ ధర దాదాపు రూ. 40 లక్షలు ఉండవచ్చు. ప్రత్యేకత ఏమిటంటే ఈ ఎస్‌యూవీ దేశంలోకి సీబీయూ యూనిట్‌గా ప్రవేశిస్తుంది.

Tags:    

Similar News