Tata Harrier EV: వామ్మో.. EV కారు 500 కి.మీ.ల రేంజా..? టాటా హారియర్ కుమ్మిపడేసిందిగా..!
Tata Harrier EV: టాటా మోటార్స్ తన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ హారియర్ ఈవీని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.

Tata Harrier EV: వామ్మో.. EV కారు 500 కి.మీ.ల రేంజా..? టాటా హారియర్ కుమ్మిపడేసిందిగా..!
Tata Harrier EV: టాటా మోటార్స్ తన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ హారియర్ ఈవీని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ వాహనాన్ని ఈ సంవత్సరం ఇండియా మొబిలిటీ ఎక్స్‌పో 2025లో తొలిసారిగా ప్రవేశపెట్టనున్నారు. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. Harrier.ev ఈ సంవత్సరం జూన్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ కారు 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్‌ను అందించగలదని చెబుతున్నారు. హారియర్ ఈవీ ధర, ఫీచర్లు తదితర వివరాలు తెలుసుకుందాం.
Tata Harrier EV Range
హారియర్ ఈవీలో డ్యూయల్ మోటార్‌తో 75 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ అందించగలదు. కొత్త హారియర్ ఈవీ కంపెనీ D8 ప్లాట్‌ఫారమ్ ఆధారంగా రూపొందించారు. ఈ ఎస్‌యూవీలో 19-అంగుళాల అల్లాయ్ వీల్స్ కనిపించబోతున్నాయి. ఈ కారులో పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లేతో 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. ఇందులో డ్రైవర్ వైపు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు,మెమరీ ఫంక్షన్ , ప్రయాణీకుల వైపు 4-వే పవర్ అడ్జస్ట్ వంటి ఫీచర్లు ఉంటాయి. ఇది మాత్రమే కాదు, కొత్త హారియర్ ఈవీ కూడా అడాస్‌తో రానుంది. ఈ కారులో 10 స్పీకర్లతో కూడిన JBL సౌండ్ సిస్టమ్ ఉంటుంది.
Tata Harrier EV Price
భద్రత కోసం 6 ఎయిర్‌బ్యాగ్స్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, బ్రేక్ అసిస్ట్, ఆటో హోల్డ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, 360 డిగ్రీ కెమెరా వంటి అనేక అద్భుతమైన ఫీచర్లను ఇందులో చూడవచ్చు. ధర గురించి చెప్పాలంటే.. కొత్త హారియన్ ఈవీ ఎక్స్-షోరూమ్ ధర దాదాపు రూ. 18 లక్షల నుండి ప్రారంభమవుతుంది.
అయితే, దీని గురించి కంపెనీ నుండి ఇంకా ఎటువంటి సమాచారం రాలేదు. డిజైన్ పరంగా, ఈ ఈవీలో కొన్ని మార్పులను చూడచ్చు. భారతదేశంలో హారియర్ ఈవీ.. హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్‌తో నేరుగా పోటీ పడనుంది. క్రెటా ఈవీ ధర రూ. 18 లక్షల నుండి ప్రారంభమవుతుంది. భారతదేశంలో కొత్త హారియర్ ఎలక్ట్రిక్ ఎంత విజయవంతమవుతుందో చూడాలి.