2025 Hero Super Splendor XTEC Launched: లెజెండరీ బైక్ కొత్తగా వచ్చేసింది.. అప్‌డేట్ ఫీచర్స్‌తో హీరో ఎక్స్‌టెక్.. మైలేజ్ ఎంతో తెలుసా..?
2025 Hero Super Splendor XTEC Launched: హీరో మోటోకార్ప్ ఇప్పుడు తన 125సీసీ సూపర్ స్ప్లెండర్ ఎక్స్‌టెక్ బైక్‌ను అప్‌డేట్ చేసింది.

2025 Hero Super Splendor XTEC Launched: లెజెండరీ బైక్ కొత్తగా వచ్చేసింది.. అప్‌డేట్ ఫీచర్స్‌తో హీరో ఎక్స్‌టెక్.. మైలేజ్ ఎంతో తెలుసా..?
2025 Hero Super Splendor XTEC Launched: హీరో మోటోకార్ప్ ఇప్పుడు తన 125సీసీ సూపర్ స్ప్లెండర్ ఎక్స్‌టెక్ బైక్‌ను అప్‌డేట్ చేసింది. ఈ బైక్ ఇంజిన్ OBD-2B ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా అప్‌డేట్ అయింది. దీనివల్ల బైక్ మెరుగైన మైలేజ్, పనితీరు, కాలుష్యాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. సూపర్ స్ప్లెండర్ ఎక్స్‌టెక్‌లో కంపెనీ కొత్త గ్రాఫిక్స్‌ను అందించింది, ఇవి దాని ఇంధన ట్యాంక్, సైడ్ ప్యానెల్‌లపై కనిపిస్తాయి. అంతే కాకుండా, ఈ బైక్‌లో ఇతర మార్పులు ఏవీ చేయలేదు. పరిమాణంలో కూడా ఎటువంటి మార్పు చేయలేదు. దీని పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి.
2025 Hero Super Splendor XTEC Engine
హీరో సూపర్ స్ప్లెండర్ XTEC 125సీసీ ఎయిర్-కూల్డ్, సింగిల్-సిలిండర్ ఇంజిన్‌తో పనిచేస్తుంది, ఇది 10.7బిహెచ్‌పి పవర్, 10.6ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ గేర్‌బాక్స్ ఉంటుంది. ఈ ఇంజిన్ అప్‌డేట్ చేసిన OBD-2B ఉద్గారాలు, ఫ్యూయల్-ఇంజెక్షన్ టెక్నాలజీతో వస్తుంది. ఈ ఇంజిన్ మెరుగ్గా పనిచేయడంతో పాటు కాలుష్యాన్ని కూడా తగ్గిస్తుంది. ఈ బైక్ లీటరుకు 69 కిమీ మైలేజీని అందిస్తుందని హీరో పేర్కొంది. ధర గురించి మాట్లాడుకుంటే, సూపర్ స్ప్లెండర్ XTEC ఎక్స్-షోరూమ్ ధర రూ. 88,128 నుండి ప్రారంభమవుతుంది.
సూపర్ స్ప్లెండర్ XTECకి నిజమైన పోటీ హోండా షైన్ 125 నుండి ఉంటుంది. షైన్ దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్. ఈ బైక్ ఇంజిన్,దాని సౌకర్యవంతమైన ప్రయాణం కస్టమర్లకు ప్రధాన ప్లస్ పాయింట్లు. ఈ బైక్‌లో 124 సీసీ 4 స్ట్రోక్, SI ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ 7.9 పిఎస్ పవర్, 11 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది కాకుండా, సున్నితమైన ప్రయాణం కోసం 5 స్పీడ్ గేర్‌బాక్స్ అందించారు.
ఈ బైక్ ఒక లీటరు పెట్రోల్‌తో 64 కి.మీ (ARAI) మైలేజీని ఇవ్వగలదు. మెరుగైన బ్రేకింగ్ కోసం, ఈ బైక్ ముందు భాగంలో 240మిమీ డిస్క్, వెనుక భాగంలో 130మిమీ డ్రమ్ బ్రేక్ ఉన్నాయి. ఈ బైక్‌కు 18 అంగుళాల ట్యూబ్‌లెస్ టైర్లు ఉన్నాయి. ధర గురించి మాట్లాడుకుంటే, దాని డ్రమ్ బ్రేక్ వేరియంట్ ధర రూ. 83251 కాగా, డిస్క్ మోడల్ ధర రూ. 87251.