Maruti Suzuki Fronx: ఫుల్ డిమాండ్.. 3 లక్షల కార్లు డెలివరీ.. మారుతి సుజుకి ఫ్రాంక్స్ సరికొత్త రికార్డ్..!

Maruti Suzuki Fronx: భారతదేశంలోని ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి, దాని సరసమైన కార్ల కారణంగా విపరీతమైన ప్రజాదరణ పొందింది.

Update: 2025-04-04 10:12 GMT

Maruti Suzuki Fronx: ఫుల్ డిమాండ్.. 3 లక్షల కార్లు డెలివరీ.. మారుతి సుజుకి ఫ్రాంక్స్ సరికొత్త రికార్డ్..!

Maruti Suzuki Fronx: భారతదేశంలోని ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి, దాని సరసమైన కార్ల కారణంగా విపరీతమైన ప్రజాదరణ పొందింది. ప్రస్తుతం మారుతీకి చెందిన ఫ్రాంక్స్ అనే కారు భారీ లాభాలను తెచ్చిపెడుతోంది. ఏ మేరకు అంటే కేవలం రెండేళ్లలో 3 లక్షలకు పైగా కార్లు అమ్ముడయ్యాయి. ఇంతకీ ఆ కారు ఏంటో తెలుసా? ఆకర్షణీయమైన డిజైన్, అద్భుతమైన ఫీచర్లు, అందుబాటు ధరలో అధిక మైలేజీతో దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న కారుగా 'మారుతి సుజుకి ఫ్రాంక్స్' గుర్తింపు సాధించింది.

మారుతి సుజుకి వెల్లడించిన డేటా ప్రకారం.. భారతదేశంలో కేవలం 10 నెలల్లో 1 లక్ష యూనిట్లు, 18 నెలల్లో 2 లక్షల యూనిట్లను చేరుకున్న అత్యంత వేగవంతమైన కారు. కేవలం రెండేళ్లలో 3 లక్షల యూనిట్లకు పైగా కార్ల విక్రయాలను సాధించింది. దీని చౌక ధర ఈ స్థాయి విక్రయాలకు ప్రధాన కారణం.

భారతదేశంలో మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఎక్స్-షోరూమ్ బేస్ వేరియంట్ ధర రూ. 7,52,000 టాప్ వేరియంట్ ధర రూ. 13,04,000. ఈ చౌక ధర కారణంగా 2023-24 ఆర్థిక సంవత్సరంలో మారుతీ 1,34,735 కార్లను విక్రయించింది. సంవత్సరం గడిచేకొద్దీ, 2024-25 ఆర్థిక సంవత్సరంలో 1,66,216 కార్లు అమ్ముడవడంతో కారుకు డిమాండ్ పెరిగింది. రెండేళ్లలో మొత్తం 3,00,951 కార్లు అమ్ముడయ్యాయి, వార్షిక వృద్ధి 23.36శాతం. భారతదేశంలో మారుతి సుజుకి ఫ్రాంక్స్.. టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, కియా సైరస్, స్కోడా కైలాక్‌లతో పోటీపడుతుంది.

Maruti Suzuki Fronx Features

కారులో 9-అంగుళాల హెచ్‌డీ స్మార్ట్‌ప్లే + ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ యాపిల్ కార్ ప్లే,ఆండ్రాయిడ్ ఆటో, అర్కామిస్ సరౌండ్ సౌండ్ సిస్టమ్, 360-డిగ్రీ వ్యూ కెమెరా, వైర్‌లెస్ ఛార్జర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, టర్న్-బై-టర్న్ నావిగేషన్‌తో హెడ్-అప్ డిస్‌ప్లే ఉన్నాయి. భద్రత విషయానికి వస్తే ఆరు ఎయిర్‌బ్యాగ్స్, హిల్-హోల్డ్ అసిస్ట్, రోల్ ఓవర్ మిటిగేషన్‌తో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, 3-పాయింట్ ఈఎల్ఆర్ సీట్ బెల్ట్‌లు, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, బ్రేక్ అసిస్ట్‌తో కూడిన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్m ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్‌లు వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఇంజిన్ విషయానికి వస్తే, ఫ్రాంక్స్ 1.2-లీటర్ డ్యూయల్-జెట్ డ్యూయల్-VVT పెట్రోల్, 1.0-లీటర్ టర్బో-బూస్టర్ జెట్ పెట్రోల్ ఇంజన్ ఉన్నాయి. 1.2-లీటర్ ఇంజన్ 5-స్పీడ్ MT లేదా 5-స్పీడ్ AMTకి జత చేసి ఉంటుంది. 1.0-లీటర్ ఇంజన్ 5-స్పీడ్ MT, 6-స్పీడ్ AT ఎంపికలతో వస్తుంది. 1.2-లీటర్ ఇంజన్ కూడా 5-స్పీడ్ MTతో CNG ఎంపికను కలిగి ఉంది.

Tags:    

Similar News