Hyundai Creta: హ్యుందాయ్ క్రెటా దూకుడు.. అమ్మకాల్లో రికార్డులు.. మిగతా మోడళ్ల పరిస్థితి ఇదీ!
Hyundai Creta: హ్యుందాయ్ క్రెటా భారతీయ వినియోగదారుల మనసులను కొల్లగొడుతోంది.

Hyundai Creta: హ్యుందాయ్ క్రెటా దూకుడు.. అమ్మకాల్లో రికార్డులు.. మిగతా మోడళ్ల పరిస్థితి ఇదీ!
Hyundai Creta: హ్యుందాయ్ క్రెటా భారతీయ వినియోగదారుల మనసులను కొల్లగొడుతోంది. గత నెల అంటే మార్చి 2025లో హ్యుందాయ్ క్రెటా (Hyundai Creta) కంపెనీలోనే కాకుండా దేశంలోనే అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలవడం ఇందుకు నిదర్శనం. హ్యుందాయ్ క్రెటా ఈ సమయంలో 10 శాతం వార్షిక వృద్ధితో 18,059 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. సరిగ్గా ఒక సంవత్సరం క్రితం అంటే మార్చి 2024లో ఈ సంఖ్య 16,458 యూనిట్లుగా ఉంది. ఈ సమయంలో కంపెనీలోని ఇతర మోడళ్ల అమ్మకాల గురించి వివరంగా తెలుసుకుందాం.
10 వేలకు పైగా అమ్ముడైన హ్యుందాయ్ వెన్యూ
అమ్మకాల జాబితాలో హ్యుందాయ్ వెన్యూ రెండో స్థానంలో నిలిచింది. వెన్యూ ఈ సమయంలో 9 శాతం వార్షిక వృద్ధితో మొత్తం 10,441 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఇక మూడో స్థానంలో హ్యుందాయ్ ఎక్స్‌టర్ నిలిచింది. హ్యుందాయ్ ఎక్స్‌టర్ 30 శాతం వార్షిక క్షీణతతో మొత్తం 5,901 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఆ తర్వాత నాలుగో స్థానంలో హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నిలిచింది. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 ఈ సమయంలో 1 శాతం వార్షిక క్షీణతతో మొత్తం 4,990 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది.
14% తగ్గిన ఐ20 అమ్మకాలు
మరోవైపు అమ్మకాల జాబితాలో ఐదో స్థానంలో హ్యుందాయ్ ఆరా నిలిచింది. హ్యుందాయ్ ఆరా ఈ సమయంలో 4 శాతం వార్షిక వృద్ధితో మొత్తం 5,074 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఆరో స్థానంలో హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నిలిచింది. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 ఈ సమయంలో 1 శాతం వార్షిక క్షీణతతో మొత్తం 4,990 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఇక ఏడో స్థానంలో హ్యుందాయ్ ఐ20 నిలిచింది. హ్యుందాయ్ ఐ20 ఈ సమయంలో 14 శాతం వార్షిక క్షీణతతో మొత్తం 4,452 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది.
కేవలం 19 యూనిట్లు అమ్ముడైన అయోనిక్ 5
అమ్మకాల జాబితాలో ఎనిమిదో స్థానంలో హ్యుందాయ్ అల్కాజార్ నిలిచింది. హ్యుందాయ్ అల్కాజార్ ఈ సమయంలో 1 శాతం వార్షిక వృద్ధితో మొత్తం 1,431 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. తొమ్మిదో స్థానంలో హ్యుందాయ్ టక్సన్ నిలిచింది. హ్యుందాయ్ టక్సన్ ఈ సమయంలో 19 శాతం వార్షిక క్షీణతతో కేవలం 89 యూనిట్ల అమ్మకాలను మాత్రమే నమోదు చేసింది. ఇక పదో స్థానంలో హ్యుందాయ్ అయోనిక్ 5 నిలిచింది. హ్యుందాయ్ అయోనిక్ 5 ఏకంగా 70 శాతం వార్షిక క్షీణతతో కేవలం 19 యూనిట్ల అమ్మకాలను మాత్రమే నమోదు చేసింది.