2025 Maruti Wagon R Launched: చిన్న కుటుంబానికి చింతలేని కార్.. 6 ఎయిర్‌బ్యాగ్స్‌తో వచ్చేసింది .. లో బడ్జెట్ బెస్ట్ మైలేజ్..!
2025 Maruti Wagon R Launched: భారతీయ మార్కెట్లో ప్రజలు దాదాపు గుడ్డిగా నమ్మే కొన్ని కార్లు ఉన్నాయి. తక్కువ ధర, మెరుగైన మైలేజ్, తక్కువ మెయింటెనెన్స్ కారణంగా ఈ కార్లకు డిమాండ్ స్థిరంగా ఉంటుంది.

2025 Maruti Wagon R Launched: చిన్న కుటుంబానికి చింతలేని కార్.. 6 ఎయిర్‌బ్యాగ్స్‌తో వచ్చేసింది .. లో బడ్జెట్ బెస్ట్ మైలేజ్..!
2025 Maruti Wagon R Launched: భారతీయ మార్కెట్లో ప్రజలు దాదాపు గుడ్డిగా నమ్మే కొన్ని కార్లు ఉన్నాయి. తక్కువ ధర, మెరుగైన మైలేజ్, తక్కువ మెయింటెనెన్స్ కారణంగా ఈ కార్లకు డిమాండ్ స్థిరంగా ఉంటుంది. అలాంటి కార్లలో ఒకటి 'మారుతి వ్యాగన్ ఆర్', ఈ కారు దాదాపు 26 సంవత్సరాలుగా మార్కెట్లో ఉంది. ఇప్పుడు కంపెనీ ఈ కారును అనేక సరికొత్త అప్‌డేడ్లతో విడుదల చేసింది. ఈ కారులో కంపెనీ అనేక ప్రధాన మార్పులు చేసింది.
2025 Wagon R Price
మారుతి సుజుకి వ్యాగన్ఆర్ కొత్త రిఫ్రెష్డ్ మోడల్‌ను విడుదల చేసింది. మునుపటి మోడల్‌తో పోలిస్తే, ఈ కారు ధర సుమారు రూ. 13,000 పెరిగింది. ఈ ధర వివిధ వేరియంట్‌లను బట్టి ఉంటుంది. అయితే, బేస్ వేరియంట్ ధరలో ఎటువంటి మార్పు లేదు. ఈ హ్యాచ్‌బ్యాక్ పెట్రోల్, సీఎన్‌జీతో సహా మొత్తం 9 విభిన్న ట్రిమ్‌లలో వస్తోంది. దీని బేస్ LXi వేరియంట్ ధర రూ. 5,64,500 నుండి ప్రారంభమవుతుంది. సీఎన్‌జీ వేరియంట్ ప్రారంభ ధర రూ. 6.54 లక్షలు. ఇది కాకుండా, టాప్ వేరియంట్ ZXi+ ధర రూ. 7.35 లక్షల వరకు పెరుగుతుంది. ఈ ధరలన్నీ ఎక్స్-షోరూమ్.
2025 Wagon R Safety Features
ఈ కారు మునుపటి కంటే మరింత సురక్షితంగా మారింది. కంపెనీ ఇప్పుడు ఈ కారులో 6 ఎయిర్‌బ్యాగ్స్‌ను ప్రామాణికంగా చేర్చింది. అంటే అన్ని వేరియంట్లలో అందుబాటులో ఉంటాయి. గతంలో, ఈ కారులో డ్యూయల్-ఎయిర్‌బ్యా్స్ మాత్రమే ప్రామాణికంగా అందుబాటులో ఉండేవి. ఇది కాకుండా, కంపెనీ ఇప్పుడు కొత్త వ్యాగన్ఆర్‌లో మూడు పాయింట్ల సీట్ బెల్ట్ అందించింది. ఇది ఏదైనా అత్యవసర పరిస్థితిలో ప్రయాణీకులకు మరింత భద్రతను అందిస్తుంది.
2025 Wagon R Engine And Mileage
మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ రెండు పెట్రోల్ ఇంజన్లతో వస్తుంది. 1.0-లీటర్,1.2-లీటర్ పెట్రోల్. 1-లీటర్ మూడు సిలిండర్ల ఇంజన్ 68.5హెచ్‌పి పవర్, 91.1ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 1.2-లీటర్ నాలుగు సిలిండర్ల ఇంజన్ 90.95హెచ్‌పి పవర్, 113.7ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ E20 ఫ్యూయల్‌తో అప్డేడ్ చేశారు. 20 శాతం ఇథనాల్, 80 శాతం పెట్రోల్‌తో నడుస్తుంది.
వేరియంట్‌ను బట్టి, ఈ ఇంజిన్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో పనిచేస్తుంది. చిన్న 1-లీటర్ ఇంజిన్ కూడా సీఎన్‌జీ పొందుతుంది, అయితే ఇది మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే వస్తుంది. దీని పెట్రోల్ ఇంజన్ లీటరుకు 23 నుండి 24 కిమీ మైలేజీని ఇస్తుంది. సీఎన్‌జీ వేరియంట్ కిలోకు 33.47 కిమీ వరకు మైలేజీని ఇస్తుంది.
వ్యాగన్ ఆర్ క్యాబిన్‌లో మారుతి ఎటువంటి మార్పులు చేయలేదు. 14-అంగుళాల అల్లాయ్ వీల్స్, డ్యూయల్-టోన్ డ్యాష్‌బోర్డ్, స్టీరింగ్-మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, ఆండ్రాయిడ్ ఆటోతో యాపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ ఉన్నాయి. కంపెనీ దీనిలో 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కూడా అందించింది.
2025 Wagon R Specifications
హార్టెక్ట్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా, మారుతి సుజుకి వ్యాగన్ఆర్ ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు కొత్త త్రీ-పాయింట్ రియర్ సెంటర్ సీట్‌బెల్ట్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, విత్ ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, సెంట్రల్ లాకిం, రియర్ పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి.
భారతదేశంలో మారుతి వ్యాగన్ ఆర్‌ని మొదటిసారిగా డిసెంబర్ 18, 1999న విడుదల చేసింది. ఈ కారు గత 26 సంవత్సరాలుగా ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్‌గా బాగా ప్రాచుర్యం పొందింది. అమ్మకాల గణాంకాలు దీనికి నిదర్శనం. 2024-25 ఆర్థిక సంవత్సరంలో వరుసగా నాలుగో సంవత్సరం మారుతి వ్యాగన్ఆర్ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది.