Kia EV6 Discounts: కారు చౌక ఈవీ బేరం.. కియా ఎలక్ట్రిక్ కారుపై రూ. 15 లక్షల డిస్కౌంట్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 663 కిమీ..!
Kia EV6 Discounts: కియా ఇండియా ఈ నెలలో దాదాపు అన్ని కార్లపై డిస్కౌంట్లను అందిస్తోంది. అయితే అతిపెద్ద డిస్కౌంట్ పొందుతున్న కారు EV6.

Kia EV6 Discounts: కారు చౌక ఈవీ బేరం.. కియా ఎలక్ట్రిక్ కారుపై రూ. 15 లక్షల డిస్కౌంట్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 663 కిమీ..!
Kia EV6 Discounts: కియా ఇండియా ఈ నెలలో దాదాపు అన్ని కార్లపై డిస్కౌంట్లను అందిస్తోంది. అయితే అతిపెద్ద డిస్కౌంట్ పొందుతున్న కారు EV6. కంపెనీ ఒక నెల క్రితమే EV6 ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను విడుదల చేసింది. దీని తరువాత రూ. 15 లక్షల ఫ్లాట్ డిస్కౌంట్, క్యాష్ డిస్కౌంట్ ఇస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారుపై ఈ తగ్గింపును డీలర్లు కూడా నిర్ధారించారు. డీలర్ల ప్రకారం.. EV6 ఎక్స్-షోరూమ్ ధర రూ.65.96 లక్షలు. 15 లక్షల తగ్గింపు తర్వాత దాని ధర రూ. 50.96 లక్షలకు తగ్గింది.
స్టాక్‌లో ఉన్న కియా EV6 మోడళ్లలో బ్లాక్, వైట్, గ్రే కలర్స్ ఉన్నాయి. ప్రత్యేకత ఏమిటంటే, కంపెనీ డీలర్లలో కొంతమంది వద్ద గత సంవత్సరాల నుండి మిగిలిపోయిన స్టాక్ కూడా ఉంది. వారు ప్రీ-ఫేస్‌లిఫ్ట్ కియా ఈవీ6 జీటీ-లైన్ AWD పై రూ. 22 లక్షల వరకు తగ్గింపును అందిస్తున్నారు. చాలా డీలర్‌షిప్‌లలో ప్రీ-ఫేస్‌లిఫ్ట్ కియా ఈవీ6 RWD అందుబాటులో లేదు.
కియా ఇండియా ఇటీవల కొత్త కియా EV6 ఫేస్‌లిఫ్ట్‌ను విడుదల చేసింది. ఇది ఇప్పుడు GT-లైన్ AWD అనే ఒకే వేరియంట్‌లో అందుబాటులో ఉంది. అప్‌డేట్ మోడల్‌లో స్లీకర్ హెడ్‌ల్యాంప్‌లు, రీప్రొఫైల్ చేసిన బంపర్లు, అల్లాయ్ వీల్స్ కోసం కొత్త డిజైన్ వంటి కొన్ని స్టైలింగ్ మార్పులు ఉన్నాయి. బయటి నుండి కారులోని మిగిలిన భాగాలకు ఎటువంటి మార్పులు చేయలేదు. కియా ఈవీ6 లోపలి భాగంలో కొత్త స్టీరింగ్ వీల్, కర్వ్ ట్విన్-స్క్రీన్ పనోరమిక్ సెటప్ ఉన్నాయి.
కియా ఈవీ6 ముఖ్యమై ఫీచర్స్‌లో ఫింగర్ ప్రింట్ ఆధారిత స్టార్టప్, లెవల్-2 అడాస్ సూట్, పవర్డ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, 14-స్పీకర్ మెరిడియన్ సౌండ్ సిస్టమ్, మరిన్ని ఉన్నాయి. కియా ఈవీ6 ఫేస్‌లిఫ్ట్‌లో 84కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఉంది. ఈ బ్యాటరీ MIDC సైకిల్ ప్రకారం ఫుల్ ఛార్జింగ్‌పై 663కిమీ రేంజ్ ఇస్తుంది. ఇండియా-స్పెక్ కారులో రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉన్నాయి. ఇవి 325పిఎస్ పవర్, 605ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తాయి.