Sun Roof Cars: రూ.10 లక్షలలోపు అద్భుతమైన ఫీచర్లు కలిగిన 5 సన్ రూఫ్ కార్లు..
Sun Roof cars Under 10L: సన్‌రూఫ్ కార్లు ప్రీమియం ఫీచర్లతో రూ.10 లక్షలలోపే అందుబాటులో ఉన్నాయి. ఈ కార్లు ధరలు అతి తక్కువలో ఉండటంతో ఎక్కువ మంది కొనుగోలు చేస్తున్నారు. ఈ కార్ల పూర్తి ఫీచర్స్ తెలుసుకుందాం..

Sun Roof Cars: రూ.10 లక్షలలోపు అద్భుతమైన ఫీచర్లు కలిగిన 5 సన్ రూఫ్ కార్లు..
Sun Roof cars Under 10L: తక్కువ బడ్జెట్ తో ఎక్కువ ఫీచర్స్ ఉన్న వస్తువులు కొనుగోలు చేయాలని అందరూ అనుకుంటారు. ఈ నేపథ్యంలో కార్ల విషయానికి వచ్చినా కూడా అంతే.. ప్రతి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కారు కొనుగోలు చేయాలని చూస్తారు. అయితే ప్రధానంగా సన్‌రూఫ్ ఉన్న కార్లు కొంటే మరింత అద్భుతంగా కనిపిస్తుంది.
బడ్జెట్లో ప్రీమియం ఫీచర్లతో కూడిన ఐదు అద్భుతమైన కార్లు కేవలం రూ.10 లక్షల ధరలోనే మన భారత మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ నడిపితే మంచి డ్రైవింగ్ అనుభూతిని కూడా అందిస్తాయి. ప్రధానంగా అలాంటి ఐదు ఫీచర్స్ కలిగిన కార్లు ఏంటో తెలుసుకుందాం .
హ్యుండాయ్ ఆస్టర్ ..
హ్యండాయ్ ఆస్టర్ ఇది వాయిస్ ఎనేబుల్ ఉన్న స్మార్ట్ ఎలక్ట్రిక్ సూపర్ సన్ రూఫ్ కారు అని చెప్పొచ్చు. దీని ధర కేవలం రూ.7.93 (ఎక్స్ షోరూమ్) లక్షలకు అందుబాటులో ఉంది. ఈ కారు డ్రైవింగ్ కూడా ఎంతో స్మూత్‌గా ఉంటుంది. ఈ కారులో 12 కెమెరాలు , ఎల్సిడి డిస్ప్లే 5.84 స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ కూడా ఉంటుంది. ఒక లీటరు పెట్రోలు 19 కిలోమీటర్లు వరకు మైలేజీ అందిస్తోంది .
టాటా పంచ్..
స్టైలిష్ లుక్ లో అద్భుతంగా కనిపించే టాటా పంచ్ ఎక్కువమంది ఆసక్తిగా కొనుగోలు చేస్తున్నారు. అయితే ఇందులో సన్‌రూఫ్ వేరియంట్ రూ.7.72 లక్షల్లో అందుబాటులో ఉంది. ఇది 5 స్టార్ రేటింగ్‌తో ఉన్న ఈ టాటా పంచ్ మోడల్ అద్భుతంగా అడ్వెంచర్ ట్రిప్‌కు సరిపోతాయి. ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇందులో టచ్ స్క్రీన్ సిస్టం కూడా ఉంటుంది. మైలేజ్ లీటరుకు పెట్రోలు 16.5 కిలోమీటర్లు, డీజిల్ 17.5 కీమీ ఇస్తుంది.
మహీంద్రా XUV 300
ఈ మహీంద్రా కారు ధర ఆధునిక ఫీచర్లతో అందుబాటులో ఉంది. సన్‌రూఫ్ ప్రీమియం ఫీచర్‌తో కేవలం రూ.7.49 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. టచ్ స్క్రీన్, డ్యూయల్ జెన్ క్లైమేట్ కంట్రోల్ కూడా ఉందిజ. 360 డిగ్రీల కెమెరా ప్రీమియం ఫీచర్లతో ఈ అద్భుతమైన కారు విలాసవంతంగా ఉంటుంది.
టాటా నెక్సాన్ ..
టాటా నెక్సాన్ సన్‌రూఫ్ వేరియంట్ అద్భుతంగా ఉంది. 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ తో ఈ కారు రూ.8 లక్షల నుండి ఎక్స్ షోరూం ధర అందుబాటులో ఉంది. ఇందులో అడ్వాన్స్ ఫీచర్స్ కలిగిన టచ్ స్క్రీన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ కూడా ఉంది. ఇంకా ఏసీ వెంట్స్ కూడా అద్భుతమైన ఫీచర్స్. సేఫ్టీ ఫీచర్స్ తో పాటు ఇంజిన్ పనితీరు కూడా అద్భుతంగా ఉంటుంది.
కియా సోనెట్ .
కియా సోనెట్ ఈ కారు డిజైన్ కూడా SUV కాంపాక్ట్. మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. ఇందులో కూడా డిజిటల్ క్లస్టర్ భద్రత ఫీచర్స్ ఉన్నాయి. ఇక సన్‌రూఫ్ వేరియంట్ ప్రారంభ ధర రూ.8.40 లక్షలు ఉంది.