Tesla Model Y: భారతీయ రోడ్లపై టెస్లా కారు.. సింగిల్ ఛార్జ్‌పై షాకింగ్ రేంజ్.. లాంచ్ ఎప్పుడంటే..?
Tesla Model Y: భారతీయ రోడ్లపై టెస్లా మోడల్ Y ఫేస్‌లిఫ్ట్ మొదటిసారిగా కనిపించింది. 'జునిపర్' అనే కోడ్‌నేమ్ ఉన్న ఈ టెస్ట్ మ్యూల్ ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్‌వేపై కనిపించింది.

Tesla Model Y: భారతీయ రోడ్లపై టెస్లా కారు.. సింగిల్ ఛార్జ్‌పై షాకింగ్ రేంజ్.. లాంచ్ ఎప్పుడంటే..?
Tesla Model Y: భారతీయ రోడ్లపై టెస్లా మోడల్ Y ఫేస్‌లిఫ్ట్ మొదటిసారిగా కనిపించింది. 'జునిపర్' అనే కోడ్‌నేమ్ ఉన్న ఈ టెస్ట్ మ్యూల్ ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్‌వేపై కనిపించింది. ఈ ఫేస్‌లిఫ్టెడ్ మోడల్‌ను ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రపంచవ్యాప్తంగా ప్రవేశపెట్టారు. త్వరలో ఈ కారును దేశంలో లాంచ్ చేయవచ్చని చెబుతున్నారు. టెస్లా అంతర్జాతీయ మార్కెట్లో ఇప్పటికే మోడల్ 3, మోడల్ S సెడాన్, మోడల్ X ఎస్‌యూవీచ సైబర్‌ట్రక్ వంటి ప్రీమియం మోడళ్లు ఉన్నాయి.
ఫేస్‌లిఫ్టెడ్ మోడల్ Y లో సైబర్‌ట్రక్ నుండి ప్రేరణ పొందిన కొన్ని డిజైన్ అంశాలు ఉన్నాయి, అవి ముందు, వెనుక భాగంలో స్ప్లిట్ హెడ్‌లైట్ డిజైన్, పూర్తి-వెడల్పు LED లైట్ బార్‌లు. మినిమలిస్ట్ థీమ్‌ను నిలుపుకుంటూ ఇంటీరియర్ ఒక ప్రధాన అప్‌గ్రేడ్ పొందింది పెద్ద 15.4-అంగుళాల టచ్‌స్క్రీన్ ఉంటుంది. దీనితో పాటు, ఇందులో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, కొత్త స్టీరింగ్ వీల్ డిజైన్, వెనుక ప్రయాణీకుల కోసం 8.0-అంగుళాల డిస్‌ప్లే, 15 స్పీకర్లు, 1 సబ్ వూఫర్, హ్యాండ్స్-ఫ్రీ ట్రంక్, 8 కెమెరాలు, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, బ్లైండ్-స్పాట్ కొలిషన్ వార్నింగ్, లేన్ డిపార్చర్ అవాయిడెన్స్ వంటి యాక్టివ్ సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి.
ప్రపంచ మార్కెట్లలో మోడల్ Y రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. బ్యాక్ వీల్ డ్రైవ్, ఆల్ వీల్ డ్రైవ్ కాన్ఫిగరేషన్లు. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 550 కిమీ కంటే ఎక్కువ రేంజ్‌ని అందించే అవకాశం ఉంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఆరు కలర్స్‌లో లభిస్తుంది. స్టీల్త్ గ్రే, పెర్ల్ వైట్, డీప్ బ్లూ మెటాలిక్, డైమండ్ బ్లాక్, అల్ట్రా రెడ్, క్విక్‌సిల్వర్. ఇంటీరియర్ కోసం రెండు కలర్ ఆప్షన్స్ ఉన్నాయి.
Tesla India
టెస్లా ఇప్పటికే దేశంలోని వివిధ ఉద్యోగాల నియామకాలను ప్రారంభించింది. అలాగే ముంబై, ఢిల్లీలో డీలర్‌షిప్‌లను ప్రారంభించాలని కంపెనీ భావిస్తోంది. భారతదేశంలో ఏ మోడళ్లను విడుదల చేస్తారనేది ఇంకా స్పష్టంగా తెలియనప్పటికీ, మోడల్ Y టెస్టింగ్ ఈ దిశలో ఒక ముఖ్యమైన సూచనగా పరిగణించవచ్చు.