Top 5 Mileage Bikes: తక్కువ ధర.. మైలేజ్ ఎక్కువ.. ఇదిగో టాప్ 5 బైకులు..!
Top 5 Mileage Bikes: అధిక మైలేజీనిచ్చే కమ్యూటర్ బైక్‌లకు భారతదేశంలో బలమైన డిమాండ్ ఉంది. పేద - మధ్యతరగతి ప్రజల రోజువారీ జీవితంలో ఇవి ప్రధానమైనవి. ప్రధానంగా రాపిడో, స్విగ్గీ, జొమాటో కార్మికుల జీవన బండ్లు.

Top 5 Mileage Bikes: తక్కువ ధర.. మైలేజ్ ఎక్కువ.. ఇదిగో టాప్ 5 బైకులు..!
Top 5 Mileage Bikes: అధిక మైలేజీనిచ్చే కమ్యూటర్ బైక్‌లకు భారతదేశంలో బలమైన డిమాండ్ ఉంది. పేద - మధ్యతరగతి ప్రజల రోజువారీ జీవితంలో ఇవి ప్రధానమైనవి. ప్రధానంగా రాపిడో, స్విగ్గీ, జొమాటో కార్మికుల జీవన బండ్లు. ప్రస్తుతం దేశంలోని హీరో, టీవీఎస్, బజాజ్, హోండా వంటి కంపెనీలు తక్కువ ధరలకు అధిక మైలేజీ, మంచి ఫీచర్లను అందించే మోటార్‌సైకిళ్లను అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధిక మైలేజ్ ఇచ్చే టాప్- 5 బైక్‌ల గురించి వివరంగా తెలుసుకుందాం.
TVS Sport
ఈ బైక్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. సెల్ఫ్ స్టార్ట్ ఈఎస్, సెల్ఫ్ స్టార్ట్ ఈఎల్ఎస్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. వీటి ధరలు వరుసగా రూ. 59881, రూ. 71223 ఎక్స్-షోరూమ్‌గా ఉన్నాయి. మూడు డ్యూయల్ టోన్ కలర్స్ ఉన్నాయి. ఇందులో BS6-కంప్లైంట్ 109.7 cc, సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజన్ ఉంది. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 10 లీటర్లు. 70 కిమీ మైలేజీని ఇస్తుంది.
Bajaj CT 110X
ఈ బైక్ ఒకే వేరియంట్‌లో ఉంది. దీని ధర రూ.69,216 ఎక్స్-షోరూమ్. మూడు కలర్స్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఇందులో ఎలక్ట్రానిక్ కార్బ్యురేటర్‌తో కూడిన 115.45సీసీ ఎయిర్ కూల్డ్ ఇంజన్ ఉంది. 11 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ ఉంది. 70 కిమీ మైలేజీని ఇస్తుంది.
Hero Splendor Plus
దేశంలో హీరో స్ప్లెండర్ ప్లస్ ధర రూ.77,176 నుండి రూ.79,926 వరకు ఉంటుంది. 4 వేరియంట్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఇందులో 97.2 సిసి, ఎయిర్ కూల్డ్, 4-స్ట్రోక్, సింగిల్ సిలిండర్, ఓహెచ్‌సి ఇంజన్ ఉంది. ఇంధన ట్యాంక్ కెపాసిటీ 9.8 లీటర్లు. 70 కిమీ మైలేజీని ఇస్తుంది.
TVS Radeon
టీవీఎస్ రేడియన్ బైక్ బేస్ ఎడిషన్, డిజి డ్రమ్, డిజి డిస్క్ అనే మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. బేస్ ఎడిషన్ బైక్ ధర రూ.59,880. డిజి డ్రమ్ వేరియంట్ ధర రూ.77,394 కాగా, డిజి డిస్క్ వేరియంట్ ధర రూ.81,394 ఎక్స్-షోరూమ్. బైక్‌లో 109.7 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజన్ ఉంది. 10 లీటర్ల కెపాసిటీ గల ఇంధన ట్యాంక్ ఉంది. లీటర్‌పై 73 కిమీ మైలేజీని ఇస్తుంది.
Honda CD 110 Dream
ఈ బైక్ ప్రస్తుతం ఒకే వేరియంట్, 4 కలర్స్‌లో అందుబాటులో ఉంది. ఇందులో 109.51 సిసి బిఎస్-6 ఇంజన్ ఉంది. 9.1 లీటర్ల కెపాసిటీ గల ఇంధన ట్యాంక్ ఉండి. లీటర్‌పై 65 కిమీ మైలేజీని ఇస్తుంది. దీని ధర రూ. 76,401 ఎక్స్-షోరూమ్.