Hero Motocorp Offers: ఇదే మంచి ఛాన్స్.. 60 రూపాయలకే ఈ రెండు బైకులు.. ఆఫర్లు అరాచకం బ్రో..!

Hero Motocorp Offers: హీరో మోటోకార్ప్ మార్చి నెలలో వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. కంపెనీ హీరో స్ప్లెండర్, హెచ్‌ఎఫ్ డీలక్స్‌పై గొప్ప ఆఫర్‌లను అందించింది.

Update: 2025-03-24 15:00 GMT
Hero Motocorp Offers

Hero Motocorp Offers: ఇదే మంచి ఛాన్స్.. 60 రూపాయలకే ఈ రెండు బైకులు.. ఆఫర్లు అరాచకం బ్రో..!

  • whatsapp icon

Hero Motocorp Offers: హీరో మోటోకార్ప్ మార్చి నెలలో వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. కంపెనీ హీరో స్ప్లెండర్, హెచ్‌ఎఫ్ డీలక్స్‌పై గొప్ప ఆఫర్‌లను అందించింది. కంపెనీ ఈ బైక్‌లపై తక్కువ EMIతో పాటు అదనపు ప్రయోజనాలను కూడా ఆఫర్ చేస్తోంది. ఇవి రెండూ ఎంట్రీ లెవల్ బైక్‌లు. ఈ రెండూ రోజువారీ ఉపయోగం కోసం గొప్ప బైక్‌లు. మీరు కూడా వీటిని కొనాలంటే ఈ అవకాశం మీకు చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ రెండు బైక్‌లను కొనుగోలు చేయడం ఇప్పుడు సులువుగా మారింది.

హెచ్‌ఎఫ్ డీలక్స్ ధర రూ.63,900 నుంచి ప్రారంభం కాగా, స్ప్లెండర్ ప్లస్ ఎక్స్-టెక్ వేరియంట్ ధర రూ.84,351 నుంచి ప్రారంభమవుతుంది. ఈ రెండు బైక్‌లపై హీరో భారీ ఆఫర్లను ప్రకటించింది. కస్టమర్‌లు 5శాతం వరకు తక్షణ తగ్గింపు లభిస్తుంది. ఇది కాకుండా, బైక్‌పై లోన్, ఈఎమ్ఐ కూడా అందుబాటులో ఉంటుంది. కస్టమర్లు ఈ బైక్‌ను రోజుకు రూ. 60 చొప్పున ఈఎమ్ఐ చెల్లించడం ద్వారా ఇంటికి తీసుకెళ్లచ్చు. ఆఫర్ గురించి మరింత సమాచారం కోసం హీరో మోటోకార్ప్ డీలర్‌షిప్‌ను సంప్రదించవచ్చు.

Hero HF Deluxe Features

హీరో మోటోకార్ప్ ఒక గొప్ప ఎంట్రీ లేబుల్ బైక్. ఇంజన్ గురించి మాట్లాడితే హచ్ఎఫ్ డీలక్స్ ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీతో కూడిన 97.2cc ఇంజన్‌ ఉంది. ఈ ఇంజన్ 8.36 పిఎస్ పవర్, 8.05ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 4 స్పీడ్ గేర్‌బాక్స్‌తో ఉంటుంది. ఈ బైక్‌లో మెటల్ గ్రాబ్ రైల్, బ్లాక్ థీమ్ ఆధారిత ఎగ్జాస్ట్, క్రాష్ గార్డ్, అల్లాయ్ వీల్స్, ట్యూబ్‌లెస్ టైర్లు వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ బైక్‌లో 9.1 లీటర్ కెపాసిటి గల ఇంధన ట్యాంక్ ఉంది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 165 మిమీ. బైక్ ముందు, వెనుక చక్రాలలో డ్రమ్ బ్రేక్‌లు అందుబాటులో ఉన్నాయి. అధిక ట్రాఫిక్‌లో కూడా ఈ బైక్‌ను సులభంగా నడపవచ్చు.

Hero Splendor Plus X-Tech Features

హీరో స్ప్లెండర్ ఎక్స్‌టెక్ 2.0లో హైటెక్ ఫీచర్లు ఉన్నాయి. డిజైన్‌లో పెద్దగా మార్పులు చేయలేదు. ఈ బైక్‌లో ఫుల్ డిజిటల్ స్పీడోమీటర్ ఉంది. ఇందులో రియల్ టైమ్ మైలేజ్ సమాచారం అందుబాటులో ఉంటుంది. ఇది కాకుండా, బ్లూటూత్, కాల్స్, ఎస్ఎమ్ఎస్, బ్యాటరీ అలర్ట్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అలానే 4 స్పీడ్ గేర్‌బాక్స్ ఉంది. ఈ ఇంజన్ మెరుగైన మైలేజీని అందిస్తుందని, 6000 కిలోమీటర్ల వరకు సర్వీస్ అవసరం ఉండదని కంపెనీ పేర్కొంది. ఒక లీటర్‌లో 73 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. అతి తక్కువ ఈఎమ్ఐ కారణంగా మార్కెట్‌లో ఈ బైక్‌ల విక్రయాల్లో ఎలాంటి తేడా ఉంటుందో చూడాలి.

Tags:    

Similar News