Best Compact SUVs: అదిరే ఫీచర్లతో అత్యంత చవకైన కార్లు.. కియా సైరోస్ టు స్కోడా కైలాక్.. ధర రూ. 8 లక్షల్లోపే!
Best Compact SUVs: దేశంలో కాంపాక్ట్ ఎస్‌యూవీలు సెడాన్, హ్యాచ్‌బ్యాక్ కార్ల మార్కెట్‌ను దెబ్బతీశాయి. వీటిని మొదటిదిసారి కారు కొనాలనే కస్టమర్ కోసం కంపెనీలు తయారు చేస్తున్నాయి.

Best Compact SUVs: అదిరే ఫీచర్లతో అత్యంత చవకైన కార్లు.. కియా సైరోస్ టు స్కోడా కైలాక్.. ధర రూ. 8 లక్షల్లోపే!
Best Compact SUVs: దేశంలో కాంపాక్ట్ ఎస్‌యూవీలు సెడాన్, హ్యాచ్‌బ్యాక్ కార్ల మార్కెట్‌ను దెబ్బతీశాయి. వీటిని మొదటిదిసారి కారు కొనాలనే కస్టమర్ కోసం కంపెనీలు తయారు చేస్తున్నాయి. ఎస్‌యూవీ నడపడం కూడా చాలా సులభం. ఈ విభాగంలో కియా, మహీంద్రా, స్కోడా వాహన తయారీ సంస్థలు బాగా ప్రాచుర్యం పొందాయి. ఇవి రూ.8 లక్షల ధరలోనే మంచి భద్రతను అందించడమే కాకుండా మైలేజ్‌ని కూడా అందిస్తాయి. రండి.. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Kia Syros
కియా కొత్త సైరోస్‌లో ఫీచర్లు, స్థలం చాలా బాగున్నాయి కానీ డిజైన్ పరంగా ఇది చాలా నిరాశపరిచింది. ఈ ఎస్‌యూవీ డిజైన్‌లో ఎలాంటి కొత్తదనం లేదు. ఇది చాలా వాహనాల మిశ్రమంలా కనిపిస్తుంది. ముందు హెడ్‌ల్యాంప్, వెనుక టెయిల్ ల్యాంప్ స్థానం చాలా తక్కువగా ఉంది. మీరు కియా అభిమాని అయితే మీరు ఈ వాహనాన్ని పరిగణించచ్చు.
ఇంజన్ విషయానికి వస్తే కియా సైరోస్‌లో 1-లీటర్ టర్బో-పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ ఉంది. మైలేజీ గురించి మాట్లాడితే, దీని 1-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో 18.20 kmpl, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో 17.68 kmpl మైలేజీని ఇస్తుంది. 1.5-లీటర్ డీజిల్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో 20.75 kmpl, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో 17.65 kmpl మైలేజీని ఇస్తుంది. ఈ మైలేజీ కాగితాలపై ఉంది కానీ అసలు డ్రైవింగ్‌లో ఈ మైలేజ్ తక్కువగా ఉంటుంది. ఎక్స్-షోరూమ్ ధర రూ. 8.99 లక్షల నుండి ప్రారంభమవుతుంది.
Skoda Kylaq
స్కోడా కైలాక్ ఒక గొప్ప ఎస్‌యూవీ. దీని ఫిట్ అండ్ ఫినిషింగ్ బెటర్‌గా ఉంటుంది. ఇంజన్ గురించి మాట్లాడితే కైలాక్‌లో 1.0L TSi పెట్రోల్ ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ 115పిఎస్ పవర్, 178ఎన్ఎయ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6 స్పీడ్ మ్యాన్యువల్, DCT ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌తో వస్తుంది. అందులో 5 మంది సులభంగా కూర్చోవచ్చు.
కైలాక్‌లో 270 లీటర్ల బూట్ స్పేస్ ఉంది. భద్రత కోసం 6 ఎయిర్‌బ్యాగ్స్, ఈబీడీతో కూడిన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, 360 డిగ్రీ కెమెరా, 3 పాయింట్ సీట్ బెల్ట్ వంటి ఫీచర్లు ఇందులో ప్రామాణికంగా ఉన్నాయి. స్కోడా కైలాక్‌కు 189 గ్రౌండ్ క్లియరెన్స్ లభిస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ రూ. 7.89 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఇది చిన్న కుటుంబానికి సరైన కాంపాక్ట్ ఎస్‌యూవీ అని రుజువు చేస్తుంది.
Mahindra XUV 3XO
మహీంద్రా XUV 3XO కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో వేగంగా అభివృద్ధి చెందుతోంది. భద్రతలో 5 స్టార్ రేటింగ్ సాధించింది. ఇందులో లెవల్ 2 ADAS, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, అతిపెద్ద సన్‌రూఫ్, 360 డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇంజన్ గురించి మాట్లాడితే ఎక్స్‌యూవీ 3XOలో మూడు ఇంజన్లు ఉన్నాయి, వీటిలో 1.2L టర్బో పెట్రోల్ ఇంజన్ 82కిలోవాట్ పవర్, 200 ఎన్ఎమ్ టార్క్ ఇస్తుంది.
ఇది కాకుండా దాని రెండవ 1.2L టర్బో పెట్రోల్ ఇంజన్ 96కిలోవాట్ పవర్, 200 ఎన్ఎమ్ టార్క్ ఇస్తుంది. దీని మూడవ 1.5L టర్బో డీజిల్ ఇంజన్ 86కిలోవాట్ పవర్, 300 ఎన్ఎమ్ టార్క్ ఇస్తుంది. ఈ ఇంజన్లు మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో ఉంటాయి. ఫీచర్ల గురించి చెప్పాలంటే 26.03 సెం.మీ ట్విన్ హెచ్‌డీ స్క్రీన్ ఉంది. ఎక్స్-షోరూమ్ ధర రూ.7.49 లక్షల నుండి ప్రారంభమవుతుంది.