Next-Gen Nissan Leaf: నిస్సాన్ లీఫ్.. ఇప్పుడు స్టైలిష్ మారనుంది.. లాంచ్ ఎప్పుడంటే..?
Next-Gen Nissan Leaf: నిస్సాన్ దాని ఫేమస్ ఎలక్ట్రిక్ కారు లీఫ్ నెక్స్ట్ జనరేషన్‌లో రానుంది.

Next-Gen Nissan Leaf: నిస్సాన్ లీఫ్.. ఇప్పుడు స్టైలిష్ మారనుంది.. లాంచ్ ఎప్పుడంటే..?
Next-Gen Nissan Leaf: నిస్సాన్ దాని ఫేమస్ ఎలక్ట్రిక్ కారు లీఫ్ నెక్స్ట్ జనరేషన్‌లో రానుంది. ఇది ఇప్పుడు స్టైలిష్ క్రాస్‌ఓవర్‌గా మారనుంది. హ్యాచ్‌బ్యాక్ డిజైన్‌కు దూరంగా, కొత్త లీఫ్ మరింత ఏరోడైనమిక్ ప్రొఫైల్, స్కల్ప్టెడ్ హుడ్, హై షోల్డర్ లైన్, పొడవాటి రియర్ హాంచ్‌లతో వస్తుంది. ఫ్రంట్ లుక్‌లో ఇంటిగ్రేటెడ్ డీఆర్ఎల్, క్లోజ్ గ్రిల్, బోల్డ్ బంపర్‌తో స్లిమ్ బూమరాంగ్ ఆకారపు ఎల్ఈడీ హెడ్‌లైట్‌లు ఉంటాయి. కారులో సెంట్రల్ ఎయిర్ వెంట్ ఉంటుంది.
ఈ కారు నిస్సాన్ అరియాతో CMF-EV ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉంటుంది. 19-అంగుళాల స్టైలిష్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. బ్లాక్ క్లాడింగ్, ఫ్లష్ ఫ్రంట్ డోర్ హ్యాండిల్స్, సి-పిల్లర్ మౌంటెడ్ రియర్ హ్యాండిల్స్ ఆధునిక, ప్రీమియమ్ లుక్‌ని అందిస్తాయి. కొత్త నిస్సాన్ లీఫ్ ఉత్తర అమెరికాలో బ్రాండ్ మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారుగా ఉంటుంది.
ఇది టెస్లా సూపర్‌చార్జర్ నెట్‌వర్క్ నుండి ఛార్జ్ చేయడానికి వీలు కల్పిస్తూ బిల్డ్‌ఇన్ NACS ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. అలానే దీనికి కొత్త కాంపాక్ట్ 3-ఇన్-1 EV పవర్‌ట్రెయిన్ అందించారు. కారు సామర్థ్యాన్ని, క్యాబిన్ స్థలాన్ని మెరుగుపరుస్తుంది. కొత్త లీఫ్ బ్యాటరీ మరియు పనితీరుకు సంబంధించిన కీలక స్పెసిఫికేషన్‌లు ఇంకా వెల్లడి కాలేదు. ఈ ఏడాది చివరి నాటికి కంపెనీ మరింత సమాచారాన్ని వెల్లడించనుంది.
నిస్సాన్ భారతదేశంలో తన పోర్ట్‌ఫోలియోను విస్తరించాలని యోచిస్తోంది. ఇటీవల యోకోహామాలో రెండు కొత్త కార్లు ప్రివ్యూ చేసింది. వీటిలో మొదటిది కాంపాక్ట్ ఎమ్‌పివి, ఈ ఏడాది చివరి నాటికి విడుదల కానుండగా, రెండోది 2026 ఆర్థిక సంవత్సరం నాటికి మార్కెట్లోకి విడుదల కానున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ. ఈ రెండు వాహనాలు నిస్సాన్ చెన్నై ఫ్యాక్టరీలో తయారు అవుతాయి, ఇది భారతీయ మార్కెట్లో బ్రాండ్ బలమైన పట్టును మరింత పెంచుతుంది.