Cars: రూ.6 లక్షల్లో అదిరిపోయే ఫీచర్లు కలిగిన.. అద్భుతమైన బడ్జెట్ ఫ్రెండ్లీ 6 కార్లు..
Budget Friendly Cars Under 6 Lakhs: మధ్యతరగతి కుటుంబాల్లో చాలామందికి కారు కొనాలనే ఆశ ఉంటుంది. అయితే ఏప్రిల్ తర్వాత కారు ధరలు రెక్కలు రానున్నాయి. ఈనేపథ్యంలో ఆరు లక్షలలోపు అందుబాటులో ఉన్న కార్ల ధరపై ఓ లుక్కేద్దాం..

Cars: రూ.6 లక్షల్లో అదిరిపోయే ఫీచర్లు కలిగిన.. అద్భుతమైన బడ్జెట్ ఫ్రెండ్లీ 6 కార్లు..
Budget Friendly Cars Under 6 Lakhs: కార్ అంటే చాలామందికి ఇష్టం. ఎన్నో ఏళ్లుగా కారు కొనాలనే కల ఉంటుంది. ఈ నేపథ్యంలో అనేక ప్రయత్నాలు చేసి వాటిని లోన్ తీసుకొని మరి కొనుగోలు చేస్తారు. అయితే మధ్యతి కుటుంబీకులకు తక్కువ ధరలో బడ్జెట్లో వచ్చే కార్లు కావాలి. రూ.6 లక్షల్లో అందుబాటులో ఉండే 6 అద్భుతమైన కార్లు ఉన్నాయి. వాటి ధర వివరాలు తెలుసుకుందాం..
మారుతి సుజుకి ఆల్టో (Maruti Suzuki Alto)..
బడ్జెట్ ఫ్రెండ్లీలో చిన్న ఫ్యామిలీకి సరిపోయే మారుతి సుజుకి ఆల్టో (Maruti Suzuki Alto) మనదేశంలో విపరీతంగా ఉపయోగిస్తారు. దీని ఇంజిన్ చాలా ఎఫెక్టివ్ గా పని చేస్తుంది. తక్కువ నిర్వహణతో కొత్తగా కారు కొనాలనుకునేవారికి ఇది బంపర్ ఛాయిస్. ఈ కారు ప్రారంభ ధర రూ.4.23 లక్షలు (ఎక్స్ షోరూం) ఉంటుంది.
మారుతి సుజుకి వ్యాగన్ఆర్ (Maruti Suzuku WagonR)..
రూ.6 లక్షల బడ్జెట్లో అందుబాటులో ఉన్న మరో అద్భుతమైన కార్ మారుతూ సుజికి వ్యాగన్ ఆర్. దీని ప్రారంభ ధర 5.65 లక్షలు (ఎక్స్ షోరూం) ఉంది. వ్యాగన్ ఆర్ కూడా చాలా ఫ్యామిలీలకు మంచి ఛాయిస్. దీని క్యాబిన్ కూడా పెద్దగా ఉంటుంది. పవర్‌ఫుల్ ఇంజిన్ ఆప్షన్.. చూడటానికి ఫీచర్స్ కూడా అదిరిపోతాయి.
మారుతి సుజుకి ఎస్‌ప్రెస్సో (Maruti Suzuku Spresso)..
చిన్న ఫ్యామిలీకి సరిపోయే.. suv మోడల్ డిజైన్ అని చెప్పొచ్చు. బడ్జెట్ ఫ్రెండ్లీలో అందుబాటులో ఉండే ఎస్ప్రెస్ గ్రేట్ ఆప్షన్. దీని ఫీచర్స్ కూడా అదుర్స్. స్టైలిష్ సిటీ కార్ దీని ప్రారంభ ధర రూ.4.26 లక్షలు (ఎక్స్ షోరూం).
మారుతి సుజుకి సెలెరియో (Maruti Suzuku Celerio)..
ఇది కూడా మారుతి కంపెనీకి చెందిన అద్భుతమైన కారు. దీని ప్రారంభ ధర రూ.5.64 లక్షలు (ఎక్స్ షోరూం) ఉంది. మారుతి సిలెరియో మంచి K10Cసి ఇంజిన్ కలిగి ఉంటుంది. ఈ కారు మైలేజ్ కూడా అద్భుతంగా ఉంటుంది.
టాటా టియాగో (Tata Tiago)..
టాటా టియాగో చూడటానికి స్టైలిష్ లుక్‌లో క్వాలిటీగా ఉంటుంది. ఈ కారు బడ్జెట్ రేంజ్‌లోనే ఉంది. ఇందులో ప్రస్తుతం సీఎన్‌జీ వేరియంట్ కూడా అందుబాటులో ఉంది. దీని ప్రారంభ ధర రూ. 5 లక్షలు (ఎక్స్ షోరూం) ఉంది.
రినాల్ట్ క్విడ్ (Renault Kwid)..
రూ.6 లక్షల బడ్జెట్లో అందుబాటులో ఉండే మరో అద్భుతమైన కారు రినాల్ట్ క్విడ్ అని చెప్పొచ్చు . దీన్ని కూడా ఎస్‌యూవీ డిజైన్ మాదిరిగా తయారు చేశారు. క్యాబిన్ కూడా చాలా విశాలంగా ఉంటుంది. బడ్జెట్ ఫ్రెండ్లీలో అందుబాటులో ఉంది. దీని ప్రారంభ ధర రూ.4.70 లక్షలు (ఎక్స్ షోరూం) ఉంది.