ABS Bikes: ABS ఫీచర్‌తో బైక్ కొనాలా?.. ఈ టాప్-5 మోడల్స్‌పై ఓ లుక్కేయండి..!
ABS Bikes: రహదారి భద్రతపై పెరుగుతున్న అవగాహన కారణంగా వాహన తయారీ కంపెనీలు ఇప్పుడు సేఫ్టీ ఫీచర్లపై ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారు.

ABS Bikes: రహదారి భద్రతపై పెరుగుతున్న అవగాహన కారణంగా వాహన తయారీ కంపెనీలు ఇప్పుడు సేఫ్టీ ఫీచర్లపై ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారు. ప్రత్యేకించి, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS) ఒక ముఖ్యమైన ఫీచర్‌గా మారింది. సడన్ బ్రేకింగ్ సమయంలో బైక్ జారిపోకుండా కంట్రలో చేస్తుంది. బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయడంలో సహాయపడుతుంది. భారతీయ రోడ్ల అనిశ్చిత ట్రాఫిక్ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే, ABS ఫీచర్‌తో కూడిన మోటార్‌సైకిళ్లు తప్పనిసరిగా మారాయి. మీరు రూ. 1 లక్ష బడ్జెట్‌లో సరసమైన ABS బైక్‌ను కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ 5 ఉత్తమ ఎంపికలు మీ కోసం..!
1. Bajaj Platina 110
దేశంలో చౌకైన ABS బైక్ అయిన బజాజ్ ప్లాటినా 110 ABS 110cc ఇంజన్‌తో వస్తుంది. కేవలం రూ.70,000 కంటే తక్కువ ఎక్స్-షోరూమ్ ధరకు దీన్ని కొనుగోలు చేయచ్చు. అద్భుతమైన మైలేజీ, సౌకర్యవంతమైన రైడింగ్ అనుభవం, తక్కువ మెయింటినెన్స్ కారణంగా పట్టణ. గ్రామీణ ప్రాంతాల్లో బాగా ప్రాచుర్యం పొందింది.
2. Hero Xtreme 125R
స్పోర్టి లుక్‌తో కనిపించే హీరో ఎక్స్‌ట్రీమ్ 125ఆర్ నేక్డ్ స్ట్రీట్‌ఫైటర్ బైక్, ఇది 125సీసీ ఇంజన్‌తో వస్తుంది. ఈ బైక్ సుమారు రూ.1 లక్ష ఎక్స్-షోరూమ్ ధరలో అందుబాటులో ఉంది. ABSతో వచ్చిన రెండవ చౌకైన మోటార్‌సైకిల్. 125cc సెగ్మెంట్‌కు ఈ బైక్‌కు మంచి ఆదరణ లభించింది.
3. Bajaj Pulsar NS125
బజాజ్ పల్సర్ NS125 మరొక 125cc స్పోర్టీ బైక్. ఇటీవల దీనిలో ABS ఫీచర్ అందించారు. దీని ప్రారంభ ధర సుమారు రూ. 1 లక్ష, కానీ ABS వేరియంట్ కోసం, మీరు అదనంగా రూ. 7,000 చెల్లించాలి. ఈ బైక్ LED హెడ్‌లైట్, బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, స్పోర్టీ డిజైన్ వంటి ఫీచర్లతో వస్తుంది.
4. Bajaj Pulsar 150
బజాజ్ పల్సర్ 150 భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన మోటార్‌సైకిళ్లలో ఒకటి, ఇది రెండు దశాబ్దాలుగా కొనుగోలుదారుల ఉత్తమ ఎంపిక. దాని క్లాసిక్ డిజైన్, శక్తివంతమైన పనితీరు ఇప్పటికీ ప్రజలను ఆకర్షిస్తుంది. కేవలం రూ. 1 లక్ష ఎక్స్-షోరూమ్ ధరలో ABS ఫీచర్‌తో వస్తుంది. ఇది సురక్షితమైన, నమ్మదగిన బైక్‌గా మారుతుంది.
5. Hero Xtreme 160R 2V
హీరో ఎక్స్‌ట్రీమ్ 160R 2V ఒక తేలికపాటి, మృదువైన, ఇంధన-సమర్థవంతమైన బైక్. రూ.1 లక్ష బడ్జెట్‌లో స్పోర్టీ, సేఫ్టీ ఫీచర్‌లు, ABSతో ఈ బైక్ వస్తుంది.