Honda Amaze Top Model: హోండా అమేజ్‌కు అదిరే డిమాండ్.. షోరూమ్‌కు క్యూ కడుతున్న జనాలు..!
Honda Amaze Top Model: హోండా ఇటీవల విడుదల చేసిన కొత్త అమేజ్‌ను కొనుగోలు చేసేందుకు కస్టమర్లు పోటీపడుతున్నారు. ఇది బడ్జెట్ రేంజ్‌లో బలమైన సేఫ్టీ ఫీచర్లను అందించే కారు.

Honda Amaze Top Model: హోండా అమేజ్‌కు అదిరే డిమాండ్.. షోరూమ్‌కు క్యూ కడుతున్న జనాలు..!
Honda Amaze Top Model: హోండా ఇటీవల విడుదల చేసిన కొత్త అమేజ్‌ను కొనుగోలు చేసేందుకు కస్టమర్లు పోటీపడుతున్నారు. ఇది బడ్జెట్ రేంజ్‌లో బలమైన సేఫ్టీ ఫీచర్లను అందించే కారు. డిజైన్, సౌకర్యం పరంగా ఈ కారులో ఎటువంటి లోపం లేదు. చాలా మంది ప్రజలు ఈ కారు బేస్ మోడల్‌ను కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. ఎందుకంటే ఇందులో అవసరానికి అనుగుణంగా మంచి ఫీచర్లు ఉన్నాయి. ప్రీమియం సెడాన్ కొనాలనుకోనే వారు ఫీచర్ ప్యాక్ చేసిన ఈ కారు టాప్ మోడల్‌ను కొనుగోలు చేయచ్చు. రండి.. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
కొత్త అమేజ్ చాలా ప్రీమియం, స్టైలిష్‌గా కనిపిస్తుంది. దీనికి కారణం కొత్త హెడ్‌ల్యాంప్‌లు, గ్రిల్, అప్‌డేట్ చేసిన ఫ్రంట్ బంపర్, హౌసింగ్ ఫాగ్ ల్యాంప్స్ వంటి ఫీచర్లు ఈ కారుకు ప్రీమియం రూపాన్ని అందిస్తాయి. కొంతమందికి, ఈ కారు ఎలివేట్ ఎస్‌యూవీని గుర్తు చేస్తుంది. బ్రాండ్ పెద్ద ORVMలను జోడించింది. ఇవి ఎలివేట్‌లో ఉపయోగించే ORVMలను పోలి ఉంటాయి. ఇంతలో సెడాన్ సిల్హౌట్ పాత తరం వలె కనిపిస్తుంది.
జపాన్ వాహన తయారీ సంస్థ కాంపాక్ట్ సెడాన్ ఫీచర్ లిస్ట్‌లో పెద్ద మార్పులు చేసింది. అమేజ్‌లో 8-అంగుళాల ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో స్టాండర్డ్‌గా అందించారు. ఈ జాబితాలో 7-అంగుళాల సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వెనుక ఏసీ వెంట్‌లు, వైర్‌లెస్ ఛార్జర్, పుష్ బటన్ స్టార్ట్/స్టాప్, ఎయిర్ ప్యూరిఫైయర్, పూర్తిగా ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వాక్‌అవే ఆటో లాక్, కనెక్టివిటీ ఫీచర్లు, మరెన్నే ఉన్నాయి. ఇవన్నీ డ్యూయల్ టోన్ ఇంటీరియర్స్‌తో వస్తాయి.
ఇంజన్, పవర్ విషయానికి వస్తే, కొత్త అమేజ్‌లో 1.2-లీటర్ నాలుగు-సిలిండర్ i-VTEC పెట్రోల్ ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ 89 బిహెచ్‌పి పవర్, 110 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఇస్తుంది. ఈ యూనిట్ MT లేదా CVTతో జత చేశారు. MTతో 18.65 kmpl మైలేజ్ క్లెయిమ్ చేస్తుంది. అయితే CVTతో 19.46 kmpl వరకు మైలేజ్ అందిస్తుంది.