MG Cyberster: అదిరే లుక్‌తో ఎంజీ ఫాస్టెస్ట్ ఎలక్ట్రిక్ కారు.. లాంచ్ ఎప్పుడంటే..?

MG Cyberster: ఎంజీ సైబర్‌స్టర్ ఈవీ భారత్‌లో ప్రవేశించబోతుంది. ఇది దేశంలోని మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ టూ-డోర్ కన్వర్టిబుల్‌గా వస్తుంది. అయితే, దాని ప్రారంభానికి ముందు, EV రాజస్థాన్‌లోని సంభార్ సాల్ట్ లేక్ వద్ద 0-100 kmph నుండి వేగవంతమైన కారుగా రికార్డు సృష్టించింది.

Update: 2025-03-26 14:30 GMT
MG Cyberster

MG Cyberster: అదిరే లుక్‌తో ఎంజీ ఫాస్టెస్ట్ ఎలక్ట్రిక్ కారు.. లాంచ్ ఎప్పుడంటే..?

  • whatsapp icon

MG Cyberster: ఎంజీ సైబర్‌స్టర్ ఈవీ భారత్‌లో ప్రవేశించబోతుంది. ఇది దేశంలోని మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ టూ-డోర్ కన్వర్టిబుల్‌గా వస్తుంది. అయితే, దాని ప్రారంభానికి ముందు, EV రాజస్థాన్‌లోని సంభార్ సాల్ట్ లేక్ వద్ద 0-100 kmph నుండి వేగవంతమైన కారుగా రికార్డు సృష్టించింది. సైబర్‌స్టర్ ఈ ఫీట్‌ను కేవలం 3.2 సెకన్లలో సాధించింది. దీనిని ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ధృవీకరించాయి.

ఎంజీ సైబర్‌స్టర్ భారతదేశంలోకి ప్రవేశించినప్పుడు కార్‌మేకర్ ప్రీమియం 'MG సెలెక్ట్' అవుట్‌లెట్‌ల ద్వారా ఈ కారు విక్రయించనుంది. ఈ కారు ఆటో ఎక్స్‌పో 2025లో ప్రదర్శించారు, ఆ తర్వాత ఈ కారు బుకింగ్ ప్రారంభమైంది. సమాచారం ప్రకారం దీని ధర దాదాపు రూ.50 నుంచి 80 లక్షల వరకు ఉంటుందని అంచనా.

డిజైన్ గురించి మాట్లాడుతూ, సైబర్‌స్టర్ షార్ప్ కట్స్, అడ్వెంచర్, స్పోర్టీ రూపాన్ని ఇస్తుంది. ఈ కారు డోర్లు ప్రధాన ఆకర్షణ. అలానే ఇందులో LED ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు, 20-అంగుళాల అల్లాయ్ వీల్స్, యారో షేప్ LED టెయిల్ లైట్లతో పాటు లైట్‌బార్‌ను కూడా ఉంది.

దీని ఇంటీరియర్‌లు సమానంగా ఫ్యూచరిస్టిక్‌గా ఉంటాయి. సైబర్‌స్టర్ డాష్‌బోర్డ్‌లో ట్రై-స్క్రీన్ సెటప్‌తో ఉంది, ఇందులో డేటాను చూడటానికి 7-అంగుళాల స్క్రీన్, డ్రైవర్ డిస్‌ప్లే కోసం 10.25-అంగుళాల స్క్రీన్, 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉన్నాయి. సెంటర్ కన్సోల్‌లో ఏసీ కంట్రోల్స్ కోసం అదనపు స్క్రీన్ ఉంది.

సైబర్‌స్టర్ ఇతర ఫీచర్ల గురించి మాట్లాడితే. ఇందులో 8-స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్, ఫోల్డబుల్ రూఫ్, మెమరీ ఫంక్షన్‌తో 6-వే ఎలక్ట్రికల్‌గా అడ్జెస్ట్ చేయగల హీటెడ్ సీట్లు ఉన్నాయి. భద్రత పరంగా 6 ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ ఉంటాయి. లేన్-కీప్ అసిస్ట్, యాక్టివ్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ అందించారు.

ఎంజీ సైబర్‌స్టర్ ఒకే బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. రెండు యాక్సిల్స్‌లో రెండు ఎలక్ట్రిక్ మోటార్‌లకు కనెక్ట్ చేసి ఉంటాయి. ఇందులో 77 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఉంది. దీని మోటార్ 510 పిఎస్ పవర్, 725 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. WLTP క్లెయిమ్ చేసిన పరిధి గురించి చెప్పాలంటే ఇది 443 కిమీ. ఇందులో వినియోగదారులు AWD చూస్తారు. ఈ కారు కేవలం 3.2 సెకండ్ల వ్యవధిలోనే 0-100 kmph వేగాన్ని అందుకుంటుంది.

Tags:    

Similar News